ఇటీవల ముంబయిలో భారీ వర్షాలతో చిన్న నీటిగుంత ఓ కారును లోపలికి లాక్కున్న ఘటన గుర్తుందా? అదే తరహా ఘటన సోమవారం దిల్లీలో చోటుచేసుకుంది. ఓ కారు రోడ్డులోకి పూర్తిగా దిగబడిపోయింది. దేశ రాజధాని నగరంలో భారీ వర్షాలతో రోడ్లన్నీ తడిసి ముద్దయ్యాయి. ఈ క్రమంలో ద్వారకాలోని సెక్టార్- 18లో రోడ్డు గుంతలా మారడంతో కారు లోపలికి జారిపోయింది.
ఒక్కసారిగా కుంగిన రోడ్డు- గుంతలో పడిన కారు
దిల్లీలో ఎడతెగని వర్షాల కారణంగా రహదారి ఒక్కసారిగా కుంగిపోయింది. అక్కడ ఉన్న కారు ఆ గోతిలోకి పడిపోయింది.
గుంతలో పడిన కారు
క్రేన్ సాయంతో దీన్ని బయటకు తీసుకొచ్చినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. అక్కడికి చేరుకున్న స్థానికులు ఫొటోలు తీశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. దీంతో దిల్లీలో రోడ్ల నాణ్యతపై విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు సందిస్తూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఇదీ చదవండి:'ఇలాంటి గుంతల రోడ్లు మనదేశంలోనే ఉంటాయా'
Last Updated : Jul 19, 2021, 10:10 PM IST