7th Pay Commission on Govt EmployeesDA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. 2023 జులై డియర్‌నెస్ అలవెన్స్ (DA) కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. గత నెలలో జరిగిన కేబినెట్ సమావేశాల్లో దీనిపై చర్చించినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే ఇంతకీ ఎంత మొత్తంలో డీఏ(DA Hike) పెంచబోతున్నారు? పెంచిన డీఏను ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉందో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ఎంత పెంచుతారంటే?
How Much DA Hike For Central Govt Employees : కేంద్ర సర్కార్ ప్రతీ ఏటా రెండు సార్లు డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ పెంచుతుంది. జనవరిలో ఓసారి, జులైలో మరోసారి ఈ పెంపు చేపడుతుంది. ఉద్యోగులకు డీఏ పెరిగినప్పుడల్లా పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ పెరుగుతుంది. ఈసారి కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డీఏ పెంపు 4 శాతంగా ఉండొచ్చని నివేదికలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం డియర్‌నెస్ అలవెన్స్ 42 శాతం ఉండగా.. మరో 4 శాతం పెరిగితే 46 శాతానికి డీఏ పెరుగుతుంది. వినియోగదారుల ధరల సూచిక (CPI-IW)ని ఉపయోగించి DAను పైనల్ చేస్తారు.
DA hike for employees in Telangana : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఒక డీఏ మంజూరు
7th Pay Commission: 7వ వేతన సంఘం ప్రకారం చూస్తే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బేసిక్ అనేది రూ.18 వేల నుంచి రూ. 56,900 వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ బేసిక్ శాలరీ ఆధారంగా ఉద్యోగులకు వేతనాలు ఎంత వరకు పెరిగే ఛాన్స్ ఉందో మనం ఒకసారి తెలుసుకుందాం.
- డీఏ 4 శాతం పెరిగితే.. ఉద్యోగులు అందుకునే మొత్తం ఇలా ఉంటుంది.
- కనీస వేతనం 18 వేల రూపాయలుగా ఉన్నవారికి.. DA రూ.720 మేర పెరిగే ఛాన్స్ ఉంది. అంటే.. ఏడాదికి రూ. 8,640 వరకు అందుకుంటారు.
- బేసిక్ శాలరీ రూ. 56,900 ఉన్నవారు.. నెలకు 2,276 పొందుతారు. సంవత్సరానికి 27,312 రూపాయలు అందుకుంటారు.
- అంటే.. అధిక మూల వేతనం కలిగిన వారికి డీఏ పెంపు కూడా ఎక్కువగా ఉంటుంది.
- కేంద్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం రెండు సార్లు డీఏ పెంచుతుంది.
- జనవరి నుంచి జూన్, అలాగే జూలై నుంచి డిసెంబర్ నాటికి డీఏ పెంపు ఉంటుంది. దీని వల్ల వేతనాలు పైకి చేరుతాయి.