ఉత్తర్ప్రదేశ్లో అంతుచిక్కని జ్వరం (Mysterious Fever) కలకలం రేపుతోంది. ఇప్పటికే ఈ జ్వరంతో ఉత్తర్ప్రదేశ్ మథురా జిల్లా కొన్హా గ్రామంలో ఆరుగురు మృతిచెందారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులే ఉండటం వల్ల ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. మరో 80 మంది మధురా, ఆగ్రాలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
రాజస్థాన్లోనూ..
మరోవైపు రాజస్థాన్లోని భరత్పుర్లోనూ ఇలాంటి కేసులే నమోదయ్యాయి. వైద్యాధికారుల వివరాల ప్రకారం.. ఇద్దరు చిన్నారులు సేవక్(9), హనీ(6) ఆస్పత్రిలోనే మృతి చెందారు. మిగతావాళ్లు రుచి(19), అవినాశ్(9), రోమియా(2), రేఖ(1) అదే లక్షణాలతో మృతిచెందారు.
కొన్హా గ్రామంలో పర్యటించిన వైద్యుల బృందం.. మలేరియా, డెంగ్యూ, కొవిడ్-19 పరీక్షల కోసం మృతుల కుటుంబసభ్యులు, బంధువుల శాంపిల్స్ సేకరించారు. వైద్యపరీక్షల్లో కొంతమందికి రక్తకణాలు పడిపోయాయని.. డెంగ్యూ జ్వరం అని తాము భావిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
ఇదీ చదవండి:'చికెన్ ఫ్రై' బాగా వండలేదని భార్యను చంపేశాడు!