తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా 19.5లక్షల మందికి వ్యాక్సిన్‌ - వ్యాక్సినేషన్‌ భారతం

దేశంలో.. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. జనవరి 16న మొదలైన ఈ డ్రైవ్​లో ఇప్పటివరకూ వ్యాక్సిన్​ తీసుకున్న వారి సంఖ్య సమారు 20లక్షలకు చేరువలో ఉందని కేంద్రం ప్రకటించింది.

19.5-lakh-healthcare-workers-vaccinated-across-the-country
దేశవ్యాప్తంగా 19.5 లక్షల మందికి వ్యాక్సిన్‌

By

Published : Jan 25, 2021, 10:02 PM IST

భారత్‌లో వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్‌లో 10వ రోజైన సోమవారం సాయంత్రం 7గంటల వరకూ 19,50,183 మంది ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్‌ను అందించినట్లు కేంద్రం వెల్లడించింది. మొత్తం 35,785 సెంటర్లలో వ్యాక్సిన్‌ను అందించారు.

ఇబ్బందులు స్వల్పమే..

సోమవారం ఒక్క రోజు 3,34,679 మందికి, 7,171 సెంటర్లలో వ్యాక్సిన్‌ను పంపిణీ చేశామని అధికారులు తెలిపారు. వీరిలో 348 మంది మాత్రం స్వల్ప ఇబ్బందులకు గురయ్యారని వారు తెలిపారు. కాగా భారత్‌లో గడచిన 24 గంటల్లో 13,203 కరోనా కేసులు నమోదయ్యాయి.

తర్వాతి దశలో వీఐపీలకు..

జనవరి 16 నుంచి దేశ వ్యాప్తంగా కరోనా టీకా కార్యక్రమం ప్రారంభించారు. కరోనాపై పోరులో ముందుండి పనిచేసిన ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు, పోలీసులకు తొలి విడతలో టీకాలను అందిస్తున్నారు. రెండో విడతలో ప్రధాని నరేంద్రమోదీతో పాటు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు కీలక నేతలకు టీకాలను అందించనున్నారు.

ఇదీ చదవండి:ట్విట్టర్​ ట్రెండింగ్​గా 'లార్జెస్ట్​ వ్యాక్సిన్ డ్రైవ్'

ABOUT THE AUTHOR

...view details