ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్లాస్మా దానం చేసి...రిటైర్డ్​ ఎస్​ఐ ప్రాణాలు కాపాడిన ఏఆర్​ కానిస్టేబుల్

By

Published : Aug 2, 2020, 9:55 PM IST

కరోనా నుంచి కోలుకున్న వారు స్వచ్చందంగా ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేసి ఇతరుల ప్రాణాలను కాపాడాలని జిల్లా ఎస్పీ కే.కే.ఎన్ అన్బురాజన్ పిలుపునిచ్చారు. కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్న వారి నుంచి ప్లాస్మా సేకరించి, కరోనా వచ్చి కోలుకోలేని వారి శరీరంలోకి ఎక్కిస్తే వారు త్వరగా కోలుకుంటారని ఎస్పీ తెలిపారు. కరోనా నుంచి కోలుకుని ప్లాస్మా దానం చేసి మరో రిటైర్డ్ పోలీసు అధికారి ఎస్.ఐ ఎం.డి రామకృష్ణ కు ప్రాణం పోసిన ఏఆర్ కానిస్టేబుల్ శ్రీనివాసులురెడ్డి పలువురికి ఆదర్శంగా నిలిచారని జిల్లా ఎస్పీ కొనియాడారు. నగదు రివార్డ్ ను ప్రకటించి ప్రత్యేకంగా అభినందించారు.

ఏ.ఏర్  కానిస్టేబుల్ పలువురుకి ఆదర్శం
ఏ.ఏర్ కానిస్టేబుల్ పలువురుకి ఆదర్శం




కడప జిల్లా ప్రొద్దుటూరులో రక్షక్ వాహనం డ్రైవర్​గా విధులు నిర్వహిస్తున్న ఎఆర్​ కానిస్టేబుల్ సాల్ల శ్రీనివాసుల రెడ్డి (ARPC 2363)(A+ve) కు ఇటీవల కరోనా పాజిటివ్ రావడంతో 14 రోజులపాటు చికిత్స తీసుకుని పూర్తి స్థాయిలో కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో విధుల్లో చేరాడు. పోలీసు శాఖలో సేవలు అందించి పదవీ విరమణ పొందిన ప్రొద్దుటూరుకు చెందిన ఎస్​ఐ రామకృష్ణ కరోనాతో ప్రాణాపాయస్థితిలో ఉన్నారని తెలిసింది. జిల్లా ఎస్పీ పిలుపు మేరకు సాల్ల శ్రీనివాసుల స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్లాస్మా అందజేశారు. దీంతో రిటైర్డ్ పోలీసు అధికారికి ఊపిరిపోసి అందరితో శభాష్ అనిపించుకున్నారు. జిల్లాలోని పోలీసు అధికారులు, తోటి పోలీసు సిబ్బంది కానిస్టేబుల్ శ్రీనివాసులురెడ్డిని అభినందించారు. జిల్లా ఎస్పీ నగదు రివార్డుతో సత్కరించారు.

ఏఏర్ కానిస్టేబుల్ అందరికీ ఆదర్శం

TAGGED:

ABOUT THE AUTHOR

...view details