ఆంధ్రప్రదేశ్

andhra pradesh

occupied hill lands: కాల్వలు పూడ్చి రోడ్లు...చెట్లను నరికి కంచెలు

By

Published : Mar 12, 2022, 3:04 PM IST

occupied hill lands: కాల్వలు పూడ్చివేసి దర్జాగా రోడ్లు వేసేశారు.. చెట్లను నరికి, గెడ్డలను కుదించి కంచె వేశారు.. కొండ ప్రాంతంలో ప్రభుత్వ భూములను కలిపేసుకోవడమే గాక.. ఆ పక్కనే ఉన్న భూములకు దారి ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. విజయనగరం జిల్లాలో సాగునీటి వనరులను ధ్వంసం చేస్తున్న అక్రమార్కుల ఆక్రమణలపై ప్రత్యేక కథనం.

occupied hill lands  in Vizianagaram
విజయనగరం జిల్లాలో భూకబ్జా

occupied hill lands: కొండలపై కురిసిన వర్షపు నీరు నేరుగా ఊరిచెరువుకు చేరే ప్రధాన కాల్వను దర్జాగా ఆక్రమించుకున్న కబ్జాదారులు.. ఏకంగా కాల్వను పూడ్చివేసి తమ పొలానికి రోడ్డు వేసుకున్నారు. విజయనగరం జిల్లా వేపాడ మండలం జాకేరు రెవెన్యూ పరిధిలోని గెడ్డపై ఉన్న టేకు, తాటిచెట్లను నరికివేసి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సర్వే నెంబర్‌ 38/4లో 2.77 ఎకరాల్లో రాళ్లగుట్ట ఉంది. దీన్ని ఆనుకుని ఓ వ్యక్తికి జిరాయితీ భూమి ఉండటంతో.. ఈ గుట్టను సైతం కలిపేసుకుని చుట్టూ కంచె వేసుకున్నారు.

విజయనగరం జిల్లాలో భూకబ్జా

occupied hill lands: ఐదు రెవెన్యూ గ్రామాల పరిధిలో విస్తరించి ఉన్న మారిక కొండల నుంచి వర్షపు నీరు సమీపంలోని గెడ్డ ద్వారా జాకేరులోని ఊర చెరువులోకి చేరుతుంది. ఈ గెడ్డను పూర్తిగా ఆక్రమించి మట్టితో కప్పేశారు. దీనికి ఆనుకుని ఉన్న మంగలి గెడ్డ సైతం సగానికి పైగా కుచించుకుపోయింది. నీటి ప్రవాహం ముందుకు వెళ్లకుండా చెట్లను నరికి గెడ్డను కప్పేశారు. పొలాల్లో చేరే అదనపు వర్షపు నీటిని కాలువలోకి మళ్ళించడానికి వీలుగా నిర్మాణాలు చేపట్టారు. గతంలో తమ పొలాలకు వెళ్లడానికి దారి ఉండేదని... ఇప్పుడు పూర్తిగా కంచెవేసి రానివ్వడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

occupied hill lands: గెడ్డలను ఆనుకుని ఉన్న టేకు, తాటిచెట్లను సైతం అటవీశాఖ అనుమతి లేకుండానే పూర్తిగా నరికివేశారు. టేకు దుంగలను మాయం చేయగా... తాటి చెట్లను అక్కడే వదిలేశారు. వీటితో పాటు సర్వే నెంబరు 37/7లో 85 సెంట్లు, 40/1 లో 57 సెంట్లు, 47లో 79 సెంట్లు, మరో ఎకరా 22 సెంట్ల పోరంబోకు స్థలాలను సైతం కొందరు ఆక్రమించుకున్నా... రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. సమీపంలోని 435 ఎకరాల కొండను ఆనుకొని ఉన్న స్థలాన్ని సైతం కబ్జాదారులు వదలడం లేదు. మారిక కొండలకు సమీపంలో రైతులకు D పట్టా భూములు ఉన్నాయి. అక్కడికి వెళ్లే మార్గాలను మూసివేయడంతో వారు చుట్టూ 4 కిలోమీటర్లు అదనంగా తిరిగి వెళ్లాల్సి వస్తోంది. ఆక్రమణలు గుర్తించామని... త్వరలోనే పూర్తిస్థాయిలో సర్వే చేపట్టి హద్దులు నిర్థారిస్తామని అధికారులు చెబుతున్నారు.

occupied hill lands: ఆక్రమణలను తొలగించి తమ పొలాలకు దారి చూపాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వ భూములను ఇళ్లస్థలాలకు ఇస్తే... పొలాలకు దగ్గరలోనే గూడు కట్టుకుంటామని వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి:Women death: పాపం పసివాడు.. నాలుగు రోజులుగా అమ్మ మృతదేహంతోనే..!

ABOUT THE AUTHOR

...view details