ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రెవెన్యూశాఖ తీరుపై ప్రజలు విసిగిపోయారని ఏసీబీ నివేదిక: ధర్మాన

By

Published : Apr 19, 2022, 8:06 PM IST

Updated : Apr 19, 2022, 10:57 PM IST

Minister Dharmana Prasada Rao Review at Srikakulam: రెవెన్యూ శాఖ తీరుపై ప్రజలు విసిగిపోయి ఉన్నారని ఏసీబీ నివేదిక ఇచ్చిందని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. రెవెన్యూశాఖ పని తీరు మెరుగుపరిచేందుకు ఆలోచిస్తున్నామన్న మంత్రి.. ఉద్యోగులు సహనంతో పనిచేయాలని చూసించారు. శ్రీకాకుళం జిల్లా జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.

మంత్రి ధర్మాన ప్రసాదరావు
Minister Dharmana Prasada Rao Review

Minister Dharmana Prasada Rao News: రెవెన్యూ శాఖ పనితీరుపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని ఏసీబీ నివేదిక చెబుతోందని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఉద్యోగులు సహనంతో పనిచేసి రెవెన్యూ శాఖకు ఉన్న చెడ్డ పేరును పోగొట్టాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లా జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశమైన ధర్మాన.. సేవలు ప్రజలకు వేగంగా అందాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా అభివృద్దికి తన వంతు కృషిచేస్తానని అధికారులకు మంత్రి హామీ ఇచ్చారు.

రెవెన్యూ శాఖ తీరుపై ప్రజలు విసిగిపోయి ఉన్నారని ఏసీబీ నివేదిక ఇచ్చింది. ఏసీబీ నివేదిక చెప్పిన విషయాలను నేను చెబితే తప్పేంటి? రెవెన్యూ శాఖను నేను ఒక మాట అన్నానంటే.. అందులో నేనూ భాగమే. రెవెన్యూ శాఖలో అందరూ బాగా పని చేయడం లేదని కాదు కదా. ఏసీబీ, విజిలెన్స్‌ నుంచి వచ్చే ఫిర్యాదులను సరిదిద్దుకోవాలి. రెవెన్యూ శాఖ పనితీరు మెరుగుపర్చేందుకు ఆలోచిస్తున్నా. మ్యుటేషన్‌ చేసేందుకు అన్ని రోజులు ఎందుకు తిప్పాలి?. సీఎం కూడా ఈ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు. ఒకరి ఆస్తులను మరొకరి పేరిట రికార్డులు మార్చేస్తున్నారు. ఆస్తుల రికార్డులు తారుమారు చేస్తే జనం చచ్చిపోతారు కదా. రెవెన్యూ అధికారులు ప్రజాప్రతినిధులను గౌరవించాలి. సర్పంచ్‌లు, ఎంపీపీలు చట్టవ్యతిరేకంగా చేయమని అడిగితే వారిని అవమానపరచొద్దు. సాధ్యం కాని విషయాలను వారికి అర్థమయ్యేలా చెప్పండి. -ధర్మాన ప్రసాదరావు, మంత్రి

ఇదీ చదవండి:ఈ ఏడాది ఒంగోలులో తెదేపా మహానాడు: చంద్రబాబు

Last Updated : Apr 19, 2022, 10:57 PM IST

ABOUT THE AUTHOR

...view details