ఆంధ్రప్రదేశ్

andhra pradesh

cannabis Seized: 22 కేజీల గంజాయి పట్టివేత... ఒకరు అరెస్టు

By

Published : Oct 4, 2021, 12:05 PM IST

కర్నూలు జిల్లాలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 22 కిలోల గంజాయిని స్వాధీనం (22kgs cannabis Seized)చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

cannabis Seized
cannabis Seized

కర్నూలు జిల్లా డోన్ రైల్వే స్టేషన్ సమీపంలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 22 కేజీల గంజాయిని స్వాధీనం(22kgs cannabis Seized) చేసుకున్నారు.

నంద్యాలకు చెందిన బ్రహ్మయ్య విజయవాడ నుంచి రైలు ద్వారా డోన్​కు గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పక్కా సమాచారం మేరకు రైల్వే స్టేషన్​లో సమీపంలో నిందితుడిని పట్టుకున్నామన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశామన్నారు. ఈ వ్యాపారంలో బ్రహ్మయ్యతో పాటు ఇంకెవరెవరు ఉన్నారనేది దర్యాప్తులో తెలుస్తుందన్నారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి

Yaganti Temple: యాగంటి ఆలయానికి ‘పేలుళ్ల’ ముప్పు

ABOUT THE AUTHOR

...view details