Trains Timings Changed : సికింద్రాబాద్ నుంచి పలు ప్రాంతాలకు బయల్దేరే రైళ్ల ప్రయాణ సమయాలు, వేళలను మారుస్తున్నట్లు దక్షిణ మధ్య (ద.మ) రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. సింహపురి, పద్మావతి, నారాయణాద్రి, నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్ రాకపోకల వేళల్లో త్వరలో మార్పులు జరగనున్నాయి.
సికింద్రాబాద్ నుంచి తిరుపతి సహా పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్ల వేళలు మారాయి. ఈ మేరకు నాలుగు రైళ్ల ప్రయాణ సమయాలు, వేళలను మారుస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే (ఎస్.సి) ఒక ప్రకటన విడుదల చేసింది. వేళలు మార్చిన వాటిలో సింహపురి, పద్మావతి, నారాయణాద్రి, నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. మార్పులు అక్టోబరు 18వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
గుడ్న్యూస్ - ఎల్బీ నగర్ టు హయత్‌నగర్ మెట్రోకు లైన్ క్లియర్ - lb nagar To hayathnagar Metro
మార్పులివే:
- సికింద్రాబాద్-గూడూరు మధ్య నడిచే సింహపురి ఎక్స్‌ప్రెస్(12710) రైలు గమ్యస్థానం చేరేందుకు ప్రస్తుత ప్రయాణ సమయం 10.35 గంటలు. ఈ రైలు సికింద్రాబాద్ స్టేషన్లో రాత్రి 11.05 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.40కి గూడూరు చేరుకుంటుంది.
- కొత్త మార్పుల ప్రకారం ప్రకారం రాత్రి 10.05 గంటలకు సికింద్రాబాద్‌లో ప్రారంభమై ఉదయం 8.55 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది. అంటే ప్రయాణ సమయం 10.50 గంటలు పట్టనుండగా ఇదివరకటి సమయంతో పోల్చితే సికింద్రాబాద్ నుంచి గూడూరుకు చేరుకోవడానికి అదనంగా 15 నిమిషాలు పడుతుంది. ఈ రైలు గతంలో మాదిరిగా విజయవాడకు తెల్లవారుజామున 4.30కి బదులుగా 3.35కి చేరుతుంది.
- సికింద్రాబాద్-తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్ (12764) ప్రయాణ వేళలు ఇకపై గూడూరు స్టేషన్ నుంచి మారనున్నాయి. గూడూరుకు తెల్లవారుజామున 4.43కి బదులుగా దాదాపు 20 నిమిషాలు ముందుగా 4.19కి చేరుకుంటుంది. తిరుపతి స్టేషన్‌కు ఉదయం 7.15 గంటలకు బదులు 6.55కి చేరుకుంటుంది. ప్రయాణ సమయం 4 నిమిషాలు పెరగే అవకాశాలున్నాయి.
- లింగంపల్లి-తిరుపతి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్(12734) వేళల్లోనూ మార్పులు చేశారు. సాయంత్రం 6.25 గంటలకు బదులుగా దాదాపు గంట ముందుగా 5.30కి బయల్దేరనుంది. తిరుపతికి ఉదయం 7 గంటలకు బదులుగా 5.55 గంటలకు చేరుతుంది.
- ప్రయాణ సమయం 12.35 గంటల నుంచి 12.25 గంటలకు (పది నిమిషాలు) తగ్గనుంది. మారిన వేళల ప్రకారం ప్రయాణికులకు 10 నిమిషాల సమయం ఆదా అవుతుంది.
- ఏపీలోని నర్సాపూర్ నుంచి మహారాష్ట్ర వెళ్లే నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్ (17231) ప్రయాణ సమయం 10.30 నుంచి 9.40కి తగ్గనుంది. ప్రస్తుతం ఉదయం 11.15కి బయల్దేరి తర్వాత రోజు ఉదయం 9.45కి చేరుకుంటుండగా మారిన వేళల ప్రకారం రాత్రి 9.50కి బయల్దేరి ఉదయం 7.30కి చేరుకుంటుంది.