ETV Bharat / state

యువత కోసం ఎన్నారైల బస్సుయాత్ర - అక్టోబరు 2న ప్రారంభం - NRIs Startup Bus Trip Soon

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 12, 2024, 1:48 PM IST

Employment Opportunity For Youth NRIs Startup Bus Trip: రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎన్నారైలు ఇంటర్నేషనల్‌ స్టార్టప్‌ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బస్సు యాత్రకు ప్రణాళికలు రచించారు. దీనిని గాంధీ జయంతి రోజు సీఎం చంద్రబాబు ద్వారా ప్రారంభించనున్నట్లు ఐఎస్​ఎఫ్​ చైర్మన్​ జేఏ చౌదరి తెలిపారు.

NRIs Startup Bus Trip Coming
NRIs Startup Bus Trip Coming (ETV Bharat)
యువత కోసం ఎన్నారైల బస్సుయాత్ర - అక్టోబరు 2న ప్రారంభం (ETV Bharat)

Employment Opportunity For Youth NRIs Startup Bus Trip: ఏపీలో కొత్తతరం కొలువులు సృష్టించేందుకు ప్రవాసాంధ్రులు చేతులు కలిపారు. ఇంటర్నేషనల్‌ స్టార్టప్‌ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బస్సు యాత్రకు ప్రణాళికలు రచించారు. దేశ విదేశాల్లో స్థిరపడిన ప్రముఖ కంపెనీల సీఈవోలు కూడా భాగస్వాములు కానున్నారు. గ్రామ స్వరాజ్యానికి కలలు కన్న గాంధీజీ జయంతి నాడే ఈ బస్సు యాత్ర ప్రారంభం కానుంది.

రాష్ట్రంలోని గ్రామీణ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందకు ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. అంకుర బస్సు యాత్ర పేరుతో వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఈ స్టార్టప్ బస్సు యాత్ర నిర్వహించాలని ఐఎస్ఎఫ్ నిర్ణయించింది. ఈ స్టార్టప్ బస్సు యాత్రతో పెట్టుబడులు, మార్కెట్ వ్యూహాల కల్పనతో గ్రామీణ స్టార్టప్​ల ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేయనున్నట్టు స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఈ బస్సు యాత్ర ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన, పెట్టుబడులు తీసుకురావడమే తమ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు.

టీడీపీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో శిక్షణ-107 మందికి విదేశాల్లో ఉద్యోగాలు - NRI TDP Teachers

ఈ అంకుర యాత్ర ప్రపంచంలోనే మొట్టమొదటిది. ప్రముఖ కంపెనీలకు చెందిన వ్యవస్థాపకులు ఈ బస్సుయాత్ర పేరుతో కార్యక్రమం చేపట్టడం అనేది ఎక్కడా జరగలేదు. ఈ బస్సులు ఏర్పాటు చేస్తున్న ప్రదేశంలో ముందుగానే సమావేశాలు, పోటీలు నిర్వహించి అవార్డులు అందిస్తాం. -జేఏ చౌదరి, ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ చైర్మన్

ఇంటి వద్దకే ఉద్యోగం, రూ.లక్షల్లో జీతం! 81 దేశాల నుంచి వేల ఉద్యోగులు- 'వీరా' స్టార్టప్​ సక్సెస్​ స్టోరీ ఇదే! - Veera Startup In Madhya Pradesh

ఈ బస్సు యాత్రలో ఏపీ నుంచి వెళ్లి విదేశాల్లో స్థిరపడిన, ఇప్పటికే రాణిస్తున్న వివిధ ప్రముఖ కంపెనీల సీఈవోలు, ఆ స్థాయి అధికారులు, ఐటీ, స్టార్టప్ కంపెనీల ప్రతినిధులు పాల్గొనున్నారు. జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో సమావేశాలు, పోటీలు నిర్వహించి, అందులో ఎంపికైన ఔత్సాహికులకు ప్రోత్సాహం అందిస్తామని ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ జేఏ చౌదరి తెలిపారు. ఈ స్టార్టప్‌ బస్సు యాత్ర దేశానికే ఆదర్శం కాబోతోందని జేఏ చౌదరి విశ్వాసం వ్యక్తం చేశారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబరు 2న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా బస్సు యాత్రను అమరావతి నుంచి ప్రారంభిస్తామని జేఏ చౌదరి తెలిపారు. తిరుపతి ఐఐటీలో జరిగే బస్సు యాత్ర ముగింపు కార్యక్రమానికి ఐటీ మంత్రి లోకేశ్‌ హాజరవుతారని వెల్లడించారు.

టెన్త్ విద్యార్హతతో ప్రభుత్వ కొలువులు, భారీగా జీతాలు- అప్లై చేసుకోండిలా! - Govt Jobs with 10th Class

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.