గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ఏడుకొండలుపై కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం బొలుసుపాడుకు చెందిన డాక్టర్ యామిని ప్రియ ఫిర్యాదు చేసింది. 2019లో మంగళగిరి మండలం నూతక్కి చెందిన బొమ్మారెడ్డి వెంకటరెడ్డితో యామినికి వివాహం జరిగింది. 2020లో యామిని ప్రియ భర్త నుంచి విడాకులు కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో కాపురానికి రావాలని వెంకటరెడ్డి గ్రామ పెద్దలతో యామిని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.
మంగళగిరి గ్రామీణ ఎస్‌ఐపై కృష్ణా జిల్లా డాక్టర్ ఫిర్యాదు
గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామీణ ఎస్‌ఐ ఏడుకొండలుపై కృష్ణా జిల్లాకు చెందిన డాక్టర్ యామిని ఫిర్యాదు చేశారు. తన భర్తతో విడాకుల కేసులో ఎస్‌ఐ తనతో దురుసుగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు. తన భర్త తల్లిదండ్రులు వారి బంధువు పోలీసుల సమక్షంలో దాడులు చేస్తున్నా... ఎస్సై ఏడుకొండలు స్పందించలేదన్నారు.
గురువారం నూతక్కికి వెళ్లిన యామినిని, ఆమె తల్లిదండ్రులను వెంకటరెడ్డి తరఫు బందువులు అడ్డుకొని ఓ ఇంట్లో బంధించారు. శుక్రవారం ఇరు వర్గాలు మాట్లాడుకుంటున్న సమయంలో వెంకటరెడ్డి తల్లిదండ్రులు బొమ్మారెడ్డి రామ్మోహన్, విజయలక్ష్మి యామిని తల్లిదండ్రులపై దాడికి పాల్పడ్డారు. ఈ వ్యవహారంపై పోలీసులకు, దిశయాప్ కు యామిని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. నూతక్కి వెళ్లిన ఎస్‌ఐ ఏడుకొండలు వెంకటరెడ్డి తల్లిదండ్రుల పక్షాన నిలిచి తమపై అన్యాయంగా దాడికి పాల్పడ్డారని యామిని ప్రియ తల్లి వాపోయారు. కనీసం చీరైన కట్టుకోనీకుండా ఎస్‌ఐ జుట్టు పట్టుకొని లాక్కొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను పోలీస్ వాహనంలో కాకుండా ప్రైవేట్ కారులో స్టేషన్ కు తీసుకొచ్చారని తెలిపారు. ఈ నేపథ్యంలో దిశ యాప్‌కు సమచారం ఇచ్చిన ఏలాంటి స్పందన రాలేదని బాధితురాలు యామిని చెప్పారు. తన భర్త తల్లిదండ్రులు వారి బంధువు పోలీసుల సమక్షంలో దాడులు చేస్తున్నా... ఎస్‌ఐ ఏడుకొండలు స్పందించలేదన్నారు. ఈ దాడిలో తన వేలు సైతం విరిగిందన్నారు. ఈ వ్యవహారంలో తనకు పోలీసులు నుంచి జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశానన్నారు. దీనిపై స్పందించిన సీఐ భూషణం..యామిని, వెంకటరెడ్డి తరఫునుంచి పరస్పరం ఫిర్యాదులు వచ్చాయన్నారు. కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఇదీ చదవండి