ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఓట్లు వేయలేదని దారికి గండ్లు.. న్యాయం చేయాలని బాధితుడు వినతి

By

Published : Feb 25, 2021, 10:07 AM IST

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం లంకల గన్నవరం పంచాయతీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో.. తమకు సహకరించలేదనే అక్కసుతో వైకాపా మద్దతుదారులు రహదారికి ఇరువైపులా గండ్లుకొట్టారు. ఇటుక బట్టీకి వెళ్లే దారిలో వాహనాలు తిరగకుండా చేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు న్యాయం చేయాలని కోరాడు.

ysrcp leaders damaged roads
ఓట్లు వేయలేదని రోడ్డు తవ్వేశారు

ఓట్లు వేయలేదని రోడ్డు తవ్వేశారు

పంచాయతీ ఎన్నికల్లో వైకాపా బలపరిచిన అభ్యర్థికి ఓట్లు వేయలేదని అక్కసుతో దారికి గండ్లు పెట్టారని బాధితులు వాపోయారు. సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం లంకలగన్నవరం పంచాయతీ ఎన్నికల్లో తెదేపా, జనసేన బలపరిచిన అభ్యర్థి సర్పంచిగా గెలుపొందారు. వైకాపా బలపరిచిన అభ్యర్థికి తాము ఓట్లు వేయలేదని కొందరు నాయకులు దారికి రెండుచోట్ల గండ్లు పెట్టారని ఇటుకబట్టీ యజమాని ముత్తాబత్తుల వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరికి ఇవతల ఒడ్డును ఇటుకబట్టీకి దారిగా వినియోగిస్తున్నామని, శ్మశానానికి వెళ్లేందుకూ ఇదే మార్గమని ఆయన వాపోయారు. దీనిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని వివరించారు. దీనిపై పి.గన్నవరం ఎస్సై జి.సురేంద్రను సంప్రదించగా తమకు ఫిర్యాదు అందలేదన్నారు.

ABOUT THE AUTHOR

...view details