ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ఎస్సీలపై దాడులను అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాలి'

By

Published : Jul 27, 2020, 10:50 AM IST

Updated : Jul 27, 2020, 5:24 PM IST

ఎస్సీలపై దాడులను అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాలని ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ అన్నారు. ఎవరైనా వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారిపై దాడులకు పాల్పడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

sunkara padhma sri on attacks on daliths in ap
ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ

ఎస్సీ, ఎస్టీ మోనార్టీల ఓటు బ్యాంకును అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారిపైనే దాడులకు తెగబడుతున్నారని ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ అన్నారు. ఇసుక లారీని అడ్డుకున్నందుకు ఓ యువకుడికి వైకాపా నాయకులు పోలీస్ స్టేషన్​లోనే శిరోముండనం చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో ఎస్సీ యువతిపై అత్యాచారం జరిగితే ముఖ్యమంత్రి నోరు మెదపలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఎస్సీలపై జరుగుతున్న దాడులపై అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న ఎస్సీ నాయకులు నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.

Last Updated : Jul 27, 2020, 5:24 PM IST

ABOUT THE AUTHOR

...view details