ETV Bharat / state

యువత తొందరపాటు నిర్ణయాలు - ఆత్మస్థైర్యం పెంచుకోవాలంటున్న మానసిక వైద్యులు - Some People Committing Suicide - SOME PEOPLE COMMITTING SUICIDE

Some People Taking Lives in More Suicides Vijayawada: ఉన్నది ఒకటే జిందగీ కాబట్టి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలనుకుని అది సాధ్యం కాకపోతే ఆత్మహత్యే ఓ జవాబు అనుకోవడం మన మూర్ఖత్వమని మానసిక వైద్యులు అంటున్నారు. కొందరు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో కుటుంబ సభ్యులకు తీవ్ర వేదన మిగుల్చుతున్నారు. సమస్యకు పరిష్కారం వెతకాలి తప్ప ఒత్తిడికిలోనై ఆత్మహత్య చేసుకోవటం సరికాదని మానసిక వైద్యులు సూచిస్తున్నారు.

Some People Taking Lives in More Suicides Vijayawada
Some People Taking Lives in More Suicides Vijayawada (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 29, 2024, 10:55 PM IST

క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడుతున్న యువత - ఆత్మస్థైర్యం పెంచుకోవాలంటున్న మానసిక వైద్యులు (ETV Bharat)

Some People Taking Lives in More Suicides Vijayawada: జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాల్సిన యువతలో కొంతమంది అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. కారణాలు ఏవైనా కొంతమంది తమ విలువైన జీవితాన్ని మధ్యలోనే ముగిస్తున్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో కుటుంబ సభ్యులకు తీవ్ర వేదన మిగుల్చుతున్నారు. సమస్యకు పరిష్కార మార్గాలు చూసుకోవాలి కానీ ఆత్మహత్యలు పరిష్కారం చూపవని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.

ప్రేమ విఫలమైందనో ఇంట్లో పెద్దలు పెళ్లికి అంగీకరించలేదనో అర్థిక ఇబ్బందులు, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో ఇలా అనేక కారణాలతో ఒత్తిడికి గురై అనేక మంది అర్ధంతరంగా మృత్యు మార్గం వైపు అడుగులు వేస్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఆస్పత్రి వినియోగంలోకి రాకపోవటం ఆర్థిక సమస్యలు చుట్టుముట్టటంతో విజయవాడకు చెందిన ఎముకల వైద్యుడు శ్రీనివాస్ ఇటీవల కుటుంబసభ్యులను చంపి తను ప్రాణం తీసుకున్నారు.

గోదావరిలో దూకి వివాహిత ఆత్మహత్యాయత్నం - క్షణాల్లో కాపాడిన జాలర్లు - Woman Attempted Suicide

రోగుల ప్రాణాలు కాపాడే వృత్తిలో ఉండి ఒత్తిడిలో విచక్షణ కోల్పోయి కట్టుకున్న భార్య, కుమారుడు, కుమార్తె, కన్నతల్లి ప్రాణం కూడా తీసేశారు. ఈఎంఐ (EMI) కట్టాల్సిన నగదు వాడుకున్న కుమారుడిని తండ్రి మందలించటంతో ఇంజనీరింగ్ విద్యార్థి మనస్తాపం చెంది ఒంటికి నిప్పంటించుకుని మరణించారు. 'ఇదే చివరి రోజు కావచ్చు’ అంటూ జీవన్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు పెట్టి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవటంతో పెనమలూరు మండలం పెదపులిపాక సమీపంలో మూడువంతులకుపైగా కాలిపోయిన స్థితిలో అతని మృతదేహాన్ని గుర్తించారు.

భార్య తిట్టిందని ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న భర్త - WIFE AND HUSBAND ISSUE

కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో రోజుకు సగటున ఐదుగురు వివిధ కారణాలతో ప్రాణాలు తీసుకుంటున్నారు. అధికారికంగా కేసులు నమోదు అవుతున్నవి కొన్ని మాత్రమే. సమస్యలు ఎదురైనప్పుడు వ్యక్తిలోని క్షణికావేశం, ఒత్తిడి ఆత్మహత్యలకు దారి తీస్తోందంటున్నారు మానసిక నిపుణులు. ఆత్మహత్యల సంఖ్య విజయవాడలో ఎక్కువగా నమోదవుతున్నాయన్న జాతీయ నేర గణాంక సంస్థ లెక్కలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2022లో జనాభాతో పోల్చి చూస్తే దేశంలో బెజవాడ 42.6 శాతంతో మొదటి స్థానంలో ఉండడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. 2022లో నగరంలో 634 ఆత్మహత్య ఘటనలు జరిగాయి. 2021తో పోలిస్తే 64.7 శాతానికి పైగా పెరగడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఎక్కువగా అనారోగ్యం, కుటుంబపరమైన సమస్యల ఒత్తిడితో క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా యువత జీవిత సమస్యల పట్ల సరైన దృక్పథం లేకపోవడం కూడా ఆత్మహత్యలకు కారణం అవుతుందని మానసిక వైద్యులు చెబుతున్నారు.

క్షణికావేశం తీరని విషాదం-కుటుంబాల్లో అంతులేనిశోకం- బీ స్ట్రాంగ్​ - Prathidwani on Trolling Suicides

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.