ఆంధ్రప్రదేశ్

andhra pradesh

శ్రీసిటీ పారిశ్రామికవాడకు 2 ఐఎస్ఓ ధ్రువీకరణ పత్రాలు

By

Published : Nov 22, 2020, 12:13 PM IST

చిత్తూరు జిలా శ్రీసిటీ పారిశ్రామికవాడకు రెండు ఐఎస్ఓ ధ్రువీకరణ పత్రాలు లభించాయి. నాణ్యత, పర్యావరణ హిత వ్యవస్థల ఉత్తమ నిర్వహణకు గాను ఈ గుర్తింపు లభించింది.

Two ISO certifications for Sri city  at chittore district
శ్రీసిటీ పారిశ్రామికవాడకు ఐఎస్ఓ ధ్రువీకరణ పత్రం


నాణ్యత, పర్యావరణహిత వ్యవస్థల ఉత్తమ నిర్వహణకు గుర్తింపుగా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్ఓ) నుంచి శ్రీసిటీ ధ్రువీకరణ పత్రాలను పొందింది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్ఓ) అనేది సాంకేతికత,ఉత్పత్తుల రెండింటికీ ప్రమాణాలను అభివృద్ధి చేయడంలో వివిధ ప్రమాణాల సంస్థలతో కలిసి పనిచేసే ఒక అంతర్జాతీయ సంస్థ. నాణ్యతా నిర్వహణకు ఐఎస్ఓ 9001:2015, పర్యావరణ హిత వ్యవస్థల నిర్వహణకు ఐఎస్ఓ 14001:2015 పత్రాలను సంస్థ నిర్వాహకులు శుక్రవారం అందజేశారు. ఈ పత్రాలు 3 సంవత్సరాలు చెల్లుతాయి.

జాతీయ స్థాయిలో తమ ప్రమాణాలు, నైపుణ్యతకు గుర్తింపుగా శ్రీసిటీ ఇప్పటికే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ప్రతిష్టాత్మక గ్రీన్ సిటీ 'గోల్డ్' రేటింగ్ , అసోచామ్ గ్రీన్ అండ్ ఎకో ఫ్రెండ్లీ మూవ్​మెంట్ (జీఈఎం) సస్టైనబిలిటీ సర్టిఫికేషన్​లను వరుసగా 2017, 2018 సంవత్సరాలలో దక్కించుకుంది.

ఐఎస్ఓ పత్రం శ్రీసిటీ ప్రస్థానంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి అన్నారు. అంకిత భావంతో అందించే సేవలకు.. నిబద్ధతకు దక్కిన గొప్ప గౌరవమని చెప్పారు. పారిశ్రామిక సంస్థల అవసరాలకు అనుగుణంగా, పర్యావరణహిత కారకమైన పద్ధతుల్లో అత్యుత్తమ ప్రమాణాలను నిర్దేశించామని ఆయన తెలిపారు. ఈ గుర్తింపును సాధించినందుకు శ్రీసిటీ బృందాన్ని అభినందిస్తున్నానని ఆయన అన్నారు.

ఇదీ చూడండి:

డ్రైవర్ నిద్ర మత్తు.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details