CM Chandrababu Letter to Telangana CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన విభజన హామీలను ఆయన లేఖలో పేర్కొన్నారు. విభజన సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేయాలని రేవంత్‌రెడ్డికి చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు దాటినా విభజన చట్టం అమల్లో భాగంగా ఉత్పన్నమైన సమస్యలపై చర్చలు జరిగినా కొన్ని అంశాలు ఇంకా పరిష్కారం కాలేదని ఆయన అన్నారు.
I have written to the Hon'ble Chief Minister of Telangana, Sri @revanth_anumula Garu, proposing a meeting to discuss matters of mutual interest between our two Telugu-speaking States. I look forward to working closely with him to resolve post-bifurcation issues, enhance… pic.twitter.com/RKVbBYwpxO
— N Chandrababu Naidu (@ncbn) July 1, 2024
ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం - chandrababu Condolence to ds
విభజన హామీలపై చర్చించుకుందాం: పరస్పర సహకారం తెలుగు ప్రజల అభ్యున్నతికి తోడ్పడుతుందని చంద్రబాబు తెలిపారు. ఉమ్మడి అంశాల సామరస్య పరిష్కారానికి ఎదురుచూస్తున్నట్లు ఆయన లేఖలో వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల సంక్షేమం, పురోగతికి దోహదపడేలా ముఖ్యమైన సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందిని రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో అభిప్రాయపడ్డారు. తెలంగాణ అభివృద్ధి, ప్రగతికి రేవంత్‌రెడ్డి చేస్తున్న కృషిని చంద్రబాబు ప్రశంసించారు. మీ అంకితభావం, నాయకత్వం తెలంగాణ ప్రగతికి గణనీయంగా తోడ్పడతాయన్నారు.
మాట నిలబెట్టుకున్న చంద్రబాబు- గుండె తరుక్కుపోయే ఆ ఘటన మీకు తెలుసా? - CBN Help to Parveen
ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లో సమావేశం: రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముఖాముఖి ద్వారా కీలక అంశాలను పరిష్కరించుకునేందుకు వీలుంటుందని అయన స్పష్టం చేశారు. ఈ చర్చలు మంచి ఫలితాలిస్తాయనే నమ్మకం ఉందని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల్లో మధ్య సుస్థిర ప్రగతి సాధించడానికి పరస్పర సహకారం అవసరమని తేల్చి చెప్పారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఇది మన బాధ్యత అని చంద్రబాబు వివరించారు. ప్రజల అభ్యున్నతికి దోహదపడేలా ఉమ్మడి లక్ష్యాలను సాధించడంలో ఇది కీలకం అని తెలిపారు.