ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అమరావతిలోనే రాజధాని: సోము వీర్రాజు

By

Published : Dec 1, 2020, 11:47 AM IST

అమరావతి కోసం కేపిటల్‌ గెయిన్స్‌తో సహా కేంద్ర ప్రభుత్వం చేయదగినదంతా చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. భారతీయ కిసాన్‌ సంఘ్‌ జాతీయ కార్యవర్గ సభ్యులు జలగం కుమారస్వామి ఆధ్వర్యంలో రాజధాని ప్రాంత రైతులతో సమావేశమయ్యారు. రాజధానిని తరలించొద్దంటూ ఏడాదిగా ఆందోళన చేస్తోన్న అంశాన్ని ప్రస్తావించిన ఆ ప్రాంత రైతులు.. తాము ప్రభుత్వానికి భూములిచ్చామే తప్ప.. వ్యక్తులకు, పార్టీలకు కాదన్నారు. కేంద్ర ప్రభుత్వ చొరవతో తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

BJP state president Somu veeraju comments
భారతీయ కిసాన్‌ సంఘ్‌తో సోము వీర్రాజు సమావేశం

అమరావతిలోనే రాజధాని ఉంటుందని, భూమిలిచ్చిన రైతులకు ప్లాట్లు ఇచ్చేలా ప్రభుత్వంపై ఉద్యమం తీసుకొస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పునరుద్ఘాటించారు. భారతీయ కిసాన్‌ సంఘ్‌ జాతీయ కార్యవర్గ సభ్యులు జలగం కుమారస్వామి ఆధ్వర్యంలో రాజధాని ప్రాంత రైతులతో సోము వీర్రాజు సమావేశమయ్యారు. రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు.

అమరావతిలోనే రాజధాని ఉండాలని.. భూమిలిచ్చిన 29 వేల మంది రైతులకు 64 వేల ప్లాట్లు ఇవ్వాలని, మిగిలిన తొమ్మిది వేల ఎకరాల భూమిని అభివృద్ధి చేయాల్సిందిగా ప్రస్తుత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. వైకాపా ప్రభుత్వం ఇవ్వకుంటే తామే ప్లాట్లు ఇప్పిస్తామని, రాజధాని భూములను అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details