Nikhat Zareen Charge as DSP Today : తెలంగాణకు చెందిన భారతీయ మహిళ బాక్సర్ నిఖత్ జరీన్ ఇవాళ డీఎస్పీగా ఉద్యోగం పొందారు. వరుసగా రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆమె, సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా లాఠీని అందుకున్నారు. ఇవాళ హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో జరిగిన చీఫ్ మినిస్టర్ కప్ 2024 క్రీడలు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ నిఖత్ జరీన్ గురించి మాట్లాడుతూ కొనియాడారు.
డీఎస్పీ యూనిఫామ్‌లో నిఖత్ జరీన్
Nikhat Zareen Charge as DSP Today (ETV Bharat)
Published : Oct 3, 2024, 10:36 PM IST
తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి కష్టపడ్డారని, ఇప్పుడు ఆ కష్టమే ఆమెను ఈ స్థాయిలో నిలబెట్టిందని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆమె డీఎస్పీగా ఉద్యోగం పొందిన నేపథ్యంలో ఇవాళ పోలీసు డ్రెస్‌లో ప్రత్యక్షమయ్యారు. దీంతో బాక్సర్‌గానే కాకుండా న్యాయాన్ని చట్టాన్ని కాపాడే లేడీ సింహంగా ఉందంటూ నెటిజన్లు సైతం సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.