ETV Bharat / spiritual

ఆ రాశి వారికి నేడు అన్ని చోట్ల ప్రశంసలే ప్రశంసలు! అమ్మవారి ఆలయ సందర్శన శుభప్రదం!! - Daily Horoscope In Telugu

Horoscope Today 4th October 2024 : 2024 అక్టోబర్ 4వ తేదీ (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Daily Horoscope In Telugu
Daily Horoscope In Telugu (ETV Bharat)

Horoscope Today 4th October 2024 : 2024 అక్టోబర్ 4వ తేదీ (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఈ రాశి వారు ఈ రోజు కష్టించి పని చేసి అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటారు. మీ కష్టానికి ప్రతిఫలంగా ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. వృత్తి పట్ల అంకితభావం, చిత్తశుద్ధి మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఆధ్యాత్మిక, ధార్మిక సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయం పెరగడం వల్ల సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. అమ్మవారి ఆలయ సందర్శన శుభప్రదం.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈ రోజు కొత్త పనులు, ఒప్పందాలు చేసుకోడానికి శుభకరంగా ఉంది. చేపట్టిన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తవుతాయి. ప్రభుత్వ రంగ ఉద్యోగులు ఉన్నతాధికారుల మద్దతుతో నూతన బాధ్యతలు చేపడతారు. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. బంధువులలో కొంతమంది ప్రవర్తన మనస్తాపం కలిగిస్తుంది. గొడవలకు, వివాదాలకు దూరంగా ఉండండి. మోసపూరిత ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి. శివారాధన శ్రేయస్కరం.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. అవగాహనా లోపం, తొందరపాటు చర్యల కారణంగా అవమానకర పరిస్థితులు ఏర్పడవచ్చు. కొత్తగా ఏ పనులు మొదలుపెట్టవద్దు. ముఖ్యమైన వ్యవహారాలు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. పిల్లల చదువులు, అనారోగ్యాల నిమిత్తం అధిక ధనవ్యయం ఉండవచ్చు. మీ ఆరోగ్యం కూడా మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తుంది. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. మానసికంగా తీవ్రమైన ఆందోళన నెలకొంటుంది. ప్రతికూల ఆలోచనలతో మనసు అల్లకల్లోలంగా మారుతుంది. ఎక్కడ తప్పు జరిగిందో అర్ధం కాక అయోమయంతో ఉంటారు. మితిమీరిన కోపం కారణంగా కుటుంబసభ్యులతో కలహాలు పెరుగుతాయి. ఆర్ధిక నష్టం సూచితం. వృత్తి వ్యాపారాలలో ప్రతి పని ఆచి తూచి చేయాల్సి ఉంటుంది. భవిష్యత్ మీద భరోసాతో ఈ రోజు ప్రశాంతంగా ఉంటే అన్ని సర్దుకుంటాయి. శివపార్వతుల ఆలయ సందర్శనతో ఆపదలు తొలగిపోతాయి.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు విశేషంగా యోగిస్తుంది. ఈ రోజు కొన్ని ముఖ్య వ్యవహారాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల మద్దతు ఉంటాయి. ప్రమోషన్, జీతం పెరుగుదల వంటి శుభ ఫలితాలు ఉంటాయి. స్నేహితులతో విహారయాత్రలకు వెళతారు. సంపద వృద్ధి చెందుతుంది. వ్యాపారంలో ఆశించిన లాభాలు ఉంటాయి. మీ పోటీదారులపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ శుభప్రదం.

.

కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు మంగళకరమైన రోజు. మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబంలో సమస్యలు తొలగిపోయి సుఖశాంతులు నెలకొంటాయి. ఆర్ధిక వ్యవహారాలు అవగాహనతో చక్కబెడతారు. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి కావడంతో ఆనందంగా ఉంటారు. మిత్రులతో విహారయాత్రలకు వెళ్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఆర్ధిక వ్యవహారాలు చక్కగా నిర్వహిస్తారు. రావాల్సిన బకాయిలు చేతికి అందుతాయి. నష్ట పోవాల్సిన చోట లాభాల పంట పండించి అందరినీ ఆశ్చర్యపరుస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగడంతో ఆనందంగా ఉంటారు. నూతన వస్తాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. శివారాధన శ్రేయస్కరం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ముఖ్యంగా ఈ రోజు అనుకోని ఆపదలు తలెత్తి ఆరోగ్య పరిస్థితి దిగజారే సూచనలు కనిపిస్తున్నాయి. శస్త్రచికిత్స జరిగే అవకాశముంది. కుటుంబ సభ్యులతో గొడవకు దారితీసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆర్ధిక సమస్యలు వెంటాడుతాయి. అవసరానికి ధనం అందక అప్పులు చేయాల్సి వస్తుంది. మీ కోపావేశాల కారణంగా సన్నిహితులు, ప్రియమైన వారితో మనస్పర్థలు ఏర్పడతాయి. శనిస్తోత్ర పారాయణతో ఆపదలు తొలగిపోతాయి.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. అదృష్టం వరించి సంపదలు కలిసివస్తాయి. మీ కుటుంబజీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తారు. స్నేహితులతో విహారయాత్రలకు వెళ్తారు. ఉద్యోగస్తులు ఆదాయం పెరగడంతో సంతోషంగా ఉంటారు. వ్యాపారస్తులు ఊహించని లాభాలను అందుకుంటారు. మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీ కనకదుర్గా దేవి ఆలయ సందర్శన శుభకరం.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారంలో పెరిగిన పోటీ కారణంగా లాభాలు తగ్గుతాయి. భాగస్వాముల మధ్య మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ఆరోగ్య పరిస్థితి దిగజారుతుంది. ఉద్యోగంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తవచ్చు. వాహన ప్రమాదాలు జరిగే సూచన ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం దృఢ పడుతుంది. శివారాధనతో పరిస్థితులు చక్కపడుతాయి.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు ప్రతికూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ రోజు ఆరోగ్యం అసలు సహకరించదు. అనారోగ్య సమస్యల కారణంగా పని పట్ల దృష్టి సారించలేక పోవడం చికాకు కలిగిస్తుంది. ఉద్యోగులకు చేపట్టిన పనిలో ఆటంకాల కారణంగా అన్ని పనులు ఆలస్యం అవుతాయి. మీ పనితీరు పట్ల ఉన్నతాధికారులు అసంతృప్తితో ఉంటారు. వ్యాపారంలో శ్రమకు తగిన ఫలితం లేక నిరాశకు గురవుతారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఆదిత్య హృదయం పారాయణ చేస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. అనుకోకుండా అనైతికమైన కార్యకలాపాలలో ఇరుక్కోవడం వలన ప్రమాదంలో పడుతారు. కోపం అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ప్రతికూల ఆలోచనలతో వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు తలెత్తుతాయి. అనారోగ్య సమస్యలకు వైద్య ఖర్చుల నిమిత్తం అధిక ధనవ్యయం ఉండవచ్చు. దానగుణం, దైవంపై అచంచల విశ్వాసం కలిగి ఉండడం వల్ల ఆపదల నుంచి గట్టెక్కుతారు. శ్రీదుర్గాదేవి ఆరాధనతో మేలు జరుగుతుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.