national

ఆర్టీసీ గుడ్​ న్యూస్​ - గిరి ప్రదక్షిణ చేయాలనుకునే వారికి ప్రత్యేక బస్సులు

By ETV Bharat Telangana Team

Published : Jul 14, 2024, 4:02 PM IST

TGSRTC Special Buses to Arunachalam Giri Pradakshina
TGSRTC Special Buses to Arunachalam Giri Pradakshina (ETV Bharat)

TGSRTC Special Buses to Arunachalam Giri Pradakshina :తమిళనాడులోని అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. గురు పౌర్ణమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం కోసం తెలంగాణలోని హైదరాబాద్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, నల్గొండ, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబుబ్‌నగర్‌, తదితర ప్రాంతాల నుంచి టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఈ నెల 21న గురుపౌర్ణమి కాగా ఈనెల 19వ తేది నుంచి 22వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోంది. ఈ ప్యాకేజీలో కాణిపాక వరసిద్ధి వినాయక స్వామితో పాటు శ్రీపురంలోని గోల్డెన్‌ టెంపుల్‌ను సందర్శించే సౌకర్యాన్ని కల్పించినట్లు అధికారులు తెలిపారు. అరుణాచల గిరి ప్రదక్షిణ ప్యాకేజీ బుకింగ్‌ కోసంtgsrtconline.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details