ETV Bharat / snippets

వరద బాధితులకు అండగా హైదరాబాద్ రేస్ క్లబ్ - రూ.2 కోట్ల విరాళం

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 10, 2024, 4:15 PM IST

MP Raghuram Reddy
Hyderabad Race Club (ETV Bharat)

Hyderabad Race Club : హైదరాబాద్ రేస్ క్లబ్‌ వరద బాధితులకు బాసటగా నిలిచింది. భారీ వర్షాలు వరద బాధితుల సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 2కోట్లు విరాళంగా అందజేసింది. హైదరాబాద్ జూబ్లీహీల్స్​లోని ముఖ్యమంత్రి నివాసంలో రూ. 2 కోట్ల చెక్కును రేవంత్ రెడ్డికి రేస్ క్లబ్ డైరెక్టర్, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, మరో డైరెక్టర్ నర్సింహా రెడ్డి కలిసి అందజేశారు.

భారీ వర్షాల కారణంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్​, నల్గొండ జిల్లాలు తీవ్ర నష్టానికి గురైన విషయం తెలిసిందే. మున్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహించడం చరిత్రలో చూడలేదని ఆ ప్రాంత వాసులు చెప్పారు. వరదలకు ఎందరో నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వం వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చింది. ఇల్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి ప్రకటించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.