national

By ETV Bharat Telangana Team

Published : Jun 18, 2024, 6:47 PM IST

ETV Bharat / snippets

'వైద్యుల బదిలీలు 20శాతం మించకుండా చేయాలి' - రాష్ట్ర ప్రభుత్వానికి డాక్టర్ల సంఘం డిమాండ్

OSMANIA DOCTORS ON TRANSFERS
TGGDA Denied on Doctors Transfer Process (ETV Bharat)

TGGDA Denied on Doctors Transfer Process : రాష్ట్రంలో చేపట్టబోయే ఉద్యోగుల బదిలీల ప్రక్రియను వైద్యులకు కూడా వర్తింప చేయడాన్ని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం(టీజీజీడీఏ) ఖండించింది. ఉద్యోగులు, వైద్యుల బదిలీలు 20శాతం మించకుండా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అడిషనల్‌ డీఎంఈతో పాటు ఇతర ప్రమోషన్‌లు ఇచ్చిన తర్వాతనే తదుపరి బదిలీల ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వ వైద్యుల సంఘం ఉస్మానియా యూనిట్ 1 అధ్యక్ష కార్యదర్శులు కృష్ణారెడ్డి, రమేశ్‌లు కోరారు.

కోఠిలోని వైద్య విద్యా సంచాలకుల కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బదిలీల ప్రక్రియపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అందరిని ఒకేసారి బదిలీ చేస్తే ఆయా ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు అందించడానికి అనుభవజ్ఞులైన వైద్యులు ఉండరని, అందుకనే 20శాతం మించి బదిలీలు చేయవద్దని కోరుతున్నట్లు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details