కుటుంబ కలహాలు - మామను హతమార్చిన అల్లుడు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 12, 2024, 9:29 AM IST
Son in Law Killed his Uncle in Nellore :నెల్లూరులో దారుణం చోటు చేసుకుంది. మామను అల్లుడు హత్య చేశాడు. నగరంలోని మద్రాస్ బస్టాండ్ వద్ద ఘటన జరిగింది. కుటుంబ కలహాలతో మామ ఆసిఫ్‌ను అల్లుడు షఫీ కత్తితో నరికాడు. దీంతో అక్కడికక్కడే ఆసిఫ్ మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ కోటేశ్వరరావు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.