national

ETV Bharat / snippets

సాక్షి పత్రికపై న్యాయపోరాటం- రేపు విశాఖ కోర్టుకు నారా లోకేశ్​

lokesh_to_visakha_court_about_sakshi_paper_article_issuelokesh_to_visakha_court_about_sakshi_paper_article_issue
lokesh_to_visakha_court_about_sakshi_paper_article_issue (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 28, 2024, 12:54 PM IST

Lokesh to Visakha Court About Sakshi Paper Article Issue :సాక్షి పత్రికపై న్యాయపోరాటంలో భాగంగా మంత్రి నారా లోకేశ్​ గురువారం విశాఖ కోర్టుకు హాజరుకానున్నారు. ప‌రువు న‌ష్టం కేసులో విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో క్రాస్ ఎగ్జామినేష‌న్‌ జరగనుంది. "చినబాబు చిరుతిండి - 25 లక్షలండి" శీర్షికతో 2019 అక్టోబర్ 22న సాక్షి ప‌త్రిక‌లో కథనం ప్రచురించారు. అసత్య ఆరోపణలతో త‌న‌ను కించపరిచేలా కథనం రాశారంటూ సాక్షి పత్రికకు లోకేశ్ నోటీసులు పంపించారు. అయినా ఆ వార్తపై సవరణ ప్రచురించకపోవడం, నోటీసుల‌కు స్పందించ‌క‌పోవ‌డంతో అప్పట్లో పరువునష్టం దావా దాఖలు చేశారు. సాక్షి కథనంలో రాసిన తేదీల్లో తాను విశాఖలో లేనని అయినా అక్కడి ఎయిర్ పోర్టులో ఏవో తిన్నట్లు రాశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. చాలా రోజులుగా వాయిదా ప‌డిన ఈ కేసు మంత్రి నారా లోకేశ్​ క్రాస్ ఎగ్జామినేష‌న్‌తో మ‌ళ్లీ మొద‌లుకానుంది.

ABOUT THE AUTHOR

...view details