national

కాంగ్రెస్ పాలన గాలికి వదిలేసి కక్షలు, ప్రతీకార చర్యలపై దృష్టి పెట్టింది: కేటీఆర్

By ETV Bharat Telangana Team

Published : Jul 17, 2024, 3:42 PM IST

KTR
KTR (ETV Bharat)

KTR on Supreme verdict :తానురాజకీయాల్లో కక్ష సాధింపు, ప్రతీకారాలకు చోటు ఉండకూడదని కోరుకునే వ్యక్తినని కేటీఆర్ అన్నారు. కానీ, దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పాలన గాలికి వదిలేసి రాజకీయ కక్షలు, ప్రతీకార చర్యలపైనే ఎక్కువ దృష్టి పెట్టిందని విమర్శించారు. పరిమితులను దాటి కాంగ్రెస్ కేసీఆర్ మీద దుష్ప్రచారాలకు పూనుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.

సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ఇలాంటి ప్రయత్నాలు ఎక్కువ కాలం నిలబడవని స్పష్టం చేసిందన్నారు. విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి కేసీఆర్​ను బద్నాం చేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని సుప్రీం తప్పు బట్టిందని తెలిపారు. కేసీఆర్ మీద కాంగ్రెస్ అధికార దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చిందన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇలాంటి ప్రతీకార రాజకీయాలకు స్వస్తి పలికి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని కేటీఆర్ సూచించారు.

ABOUT THE AUTHOR

...view details