national

ఎర్రవెల్లిలో సందడిగా హిమాన్షు జన్మదిన వేడుకలు - ఆశీర్వదించిన కేసీఆర్​ దంపతులు

By ETV Bharat Telangana Team

Published : Jul 12, 2024, 9:54 PM IST

Himanshu Birthday Celebrations
KCR Grandson Himanshu Birthday Celebrations at Erravalli (ETV Bharat)

KCR Grandson Himanshu Birthday Celebrations at Erravelli : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనుమడు, మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు కల్వకుంట్ల హిమాన్షు పుట్టినరోజు వేడుకలు సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. నాయనమ్మ శోభమ్మ ఇష్టంతో 19 కేజీల భారీ కేకును తయారుచేయించారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు సిబ్బంది నడుమ హిమాన్షు తన పుట్టినరోజు వేడుక జరుపుకున్నారు.

భారీ కేకును కట్ చేసి తాతయ్య, నాయనమ్మలకు కేకును తినిపించిన హిమాన్షు, వారి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోశ్​ కుమార్ పిలుపు మేరకు తన పుట్టినరోజును పురస్కరించుకుని, తమ నివాసం ఆవరణలో హిమాన్షు మొక్కను నాటారు. ఈ సందర్భంగా హిమాన్షు మాతృమూర్తి శైలిమ, అమ్మమ్మ శశికళ, వినోదమ్మ, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details