national

జలవనరులశాఖ మెకానికల్ సలహాదారుడిగా కన్నయ్యనాయుడు- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 29, 2024, 7:28 PM IST

irrigation_mechanical_advisor
irrigation_mechanical_advisor (ETV Bharat)

Govt Appointing Kannayya Naidu as Irrigation Mechanical Advisor:జలవనరుల శాఖలో మెకానికల్ విభాగం సలహాదారుడిగా కన్నయ్య నాయుడును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల హైడ్రాలిక్ గేట్లు- హ్యాండ్లింగ్ పరికరాలు వంటి విషయాల్లో సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే తుంగభద్ర ప్రాజెక్టు గేట్ బిగింపు ప్రక్రియలో కన్నయ్య నాయుడు కీలక పాత్ర పోషించారు. రాష్ట్రంలో వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల గేట్ల విషయమై ప్రభుత్వం ఆందోళనలో ఉంది. ప్రాజెక్టు గేట్ల మరమ్మతు సహా గేట్ల నిర్వహణ విషయంలో కన్నయ్య సలహాలను ప్రభుత్వం స్వీకరించనుంది. తుంగభద్ర ప్రాజెక్టు గేట్ బిగింపునకు కన్నయ్య అందించిన సేవలని గుర్తించి ఇటీవలే సీఎం చంద్రబాబు సన్మానించారు.

ABOUT THE AUTHOR

...view details