EPFO Arrest Man for PF Due :ఉద్యోగుల పీఎఫ్ బకాయిలు చెల్లించని యాజమాన్యాలపై ఈపీఎఫ్వో చర్యలు చేపట్టింది. ఈ మేరకు చర్లపల్లిలోని ఓ ఇండస్ట్రియల్ కో-ఆపరేటివ్ సొసైటీ యాజమాన్యానికి చెందిన రమేశ్ పర్టానిని అరెస్టు చేసినట్లు ఈపీఎఫ్వో హైదరాబాద్ విభాగం పేర్కొంది. 2004 నుంచి 2010 వరకు పని చేసిన వర్కర్లకు పీఎఫ్ బకాయిలను ఈ సంస్థ చెల్లించలేదు. పీఎఫ్ బకాయిలు చెల్లించాలంటూ ఈపీఎఫ్వో పలుమార్లు నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదు.
పీఎఫ్ బకాయిలు చెల్లించని యాజమాన్యం - యజమానిని జైలుకు పంపిన ఈపీఎఫ్వో
Published : 19 hours ago
దీంతో రమేశ్ పర్టానిపై అరెస్టు వారెంట్ జారీ కాగా, నల్లకుంట పోలీసుల సహకారంతో ఈపీఎఫ్వో రమేశ్ పర్టానిని బర్కత్పురా కార్యాలయంలో విచారించింది. కార్మికుల పీఎఫ్ బకాయిలు చెల్లించకపోవడంతో పాటు ఈపీఎఫ్వో చట్టం నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈపీఎఫ్వో రికవరీ అధికారి రమేశ్ పర్టానికి జైలుశిక్ష విధించి చర్లపల్లి జైలుకు తరలించారు. కార్మికుల పీఎఫ్ బకాయిలు చెల్లించకుండా డిఫాల్ట్ అయ్యే యాజమాన్యాలపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఈపీఎఫ్వో రికవరీ అధికారి హెచ్చరించారు.