national

ఇంజినీరింగ్​ తొలి విడత సీట్ల కేటాయింపు నేడే!

By ETV Bharat Telangana Team

Published : Jul 19, 2024, 9:54 AM IST

Published : Jul 19, 2024, 9:54 AM IST

Telangana Engineering
Telangana Engineering (ETV Bharat)

Telangana Engineering Seat Allotment : తెలంగాణ ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించి తొలి విడత కౌన్సెలింగ్​ సీట్లను శుక్రవారం కేటాయించనున్నారు. ఈ నెల 16న సాయంత్రం నాటికి 95,383 మంది వెబ్​ ఆప్షన్లు ఇచ్చారు. గడువు తేదీ బుధవారం రాత్రి వరకు ఉండగా అప్పటివరకు ఎంతమంది అన్నది ప్రవేశాల కమిటీ వెల్లడించాల్సి ఉంది. దాదాపు 96 మంది వరకు ఉండొచ్చని అంచనా. కన్వీనర్​ కోటాలో 72,741 బీటెక్‌ సీట్లు అందుబాటులో ఉండగా వాటిలో సీఎస్‌ఈ( కంప్యూటర్​ సైన్స్​), సంబంధిత సీట్లు 49,786 ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details