పవన్‌కల్యాణ్‌కు స్వల్ప అస్వస్థత - జ్వరంతోనే అధికారులతో సమీక్ష
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 5, 2024, 10:50 PM IST
Deputy CM Pawan Kalyan slightly Ill-health: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. వైరల్ జ్వరం, దగ్గుతో బాధ పడుతున్నారు. అయినా, వరద ప్రాంతాల్లోని పారిశుద్ధ్య నిర్వహణపై పవన్ తన నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని, సూపర్ క్లోరినేషన్ చేపట్టాలని ఆదేశించారు. అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం, దోమల బెడద తీవ్రత ఉన్నందున పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని చెప్పారు. స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటూ నిరంతర పర్యవేక్షణ చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఏలేరు రిజర్వాయర్‌కి వరద ముప్పుపై ఆరా తీశారు.