"70 ఏళ్లు పైబడిన అందరికీ ఉచిత ఆరోగ్య బీమా" - ప్రధాని మోదీకి పవన్ కల్యాణ్ ధన్యవాదాలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 12, 2024, 5:28 PM IST
Pawan on Ayushman Bharat 70 Years Scheme : దేశంలో 70 ఏళ్లు పైబడిన వారికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఆరోగ్య బీమా పథకం ఉదాత్తమైనదని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రశంసించారు. తద్వారా ఆరు కోట్ల మంది వయోధికులకు ప్రయోజనకరమన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. 70 సంవత్సరాలు దాటిన వారందరికీ 5 లక్షల ఉచితంగా ఆరోగ్య బీమా కల్పించడం హర్షదాయకమని అన్నారు. నూతన పథకం ద్వారా 4.5 కోట్ల కుటుంబాలకు ఇది గొప్ప ఊరటని పవన్ కల్యాణ్ వెల్లడించారు.