national

రాయదుర్గంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత - అన్యాయం జరిగిందన్న బాధితులు

By ETV Bharat Telangana Team

Published : Aug 26, 2024, 5:24 PM IST

Hydra Demolitions in Rayadurg
Hydra Demolitions in Rayadurg (ETV Bharat)

Hydra Demolitions in Rayadurg : హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై ఓవైపు హైడ్రా మరోవైపు రెవెన్యూ అధికారుల వరుస దాడులు కబ్జాదారుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా రాయదుర్గంలోని తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ స్థలంలో నిర్మాణాలు ఉన్నాయంటూ రెవెన్యూ అధికారులు నేలమట్టం చేశారు. అయితే తమ పూర్వీకుల నుంచి ఇవే ఇళ్లలో ఉంటున్నామని, ఇది ప్రభుత్వ స్థలం కాదు తమ సొంత స్థలమని బాధితులు వాపోయారు. కూల్చేసిన ఇళ్లకు సంబంధించి కరెంటు బిల్లు, నల్లా బిల్లులు కడుతున్నామన్న బాధితులు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఇళ్లు కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details