విశాఖ ఎర్రమట్టి దిబ్బల విధ్వంసంపై స్పందించిన సీఎంవో
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 17, 2024, 2:41 PM IST
|Updated : Jul 18, 2024, 10:29 AM IST
CMO Reaction on Visakha Red Clay Dunes Issue:విశాఖ ఎర్రమట్టి దిబ్బల విధ్వంసంపై సీఎంవో(AP CM Office) స్పందించింది. జిల్లా అధికారులతో మాట్లాడి తవ్వకాలు నిలిపి వేయించింది. ఎర్రమట్టి దిబ్బల విధ్వంసంపై కలెక్టర్ నుంచి సీఎంవో నివేదిక కోరింది. పర్యావరణానికి హాని చేసే చర్యలపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో విశాఖ భీమిలి ఎర్రమట్టి దిబ్బలు విధ్వంసానికి గురయ్యాయి. అక్కడ భారీ యంత్రాలతో నిర్మాణ పనులు చేపట్టడం వల్ల వాటి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. భౌగోళిక చరిత్ర ఆనవాళ్లకు నిదర్శంగా ఉన్న విశాఖ భీమిలి ఎర్రమట్టి దిబ్బలను పరిరక్షించాలని పర్యావరణ వేత్తలు గళమెత్తారు. దీనిపై మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.