Amaravati Drone Summit 2024 : ఈ నెల 22,23 తేదీల్లో జరుగనున్న అమరావతి డ్రోన్ సమ్మిట్-2024 నిర్వహణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను ఈ జాతీయ సెమినార్ నిర్వహణ భాగస్వామిగా నియమిస్తున్నట్లు పేర్కొంది. ఈ సదస్సు నిర్వహణకు రూ.5.54 కోట్ల వ్యయం అవుతుందని తెలిపింది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో రెండు రోజుల పాటు జాతీయ స్థాయి కాన్ఫరెన్స్ జరగనుంది.
అమరావతి డ్రోన్ సమ్మిట్ నిర్వహణకు ప్రభుత్వం ఉత్తర్వులు
Amaravati Drone Summit 2024 (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 14, 2024, 8:24 PM IST
వ్యవసాయం, వైద్యారోగ్యం, అర్పన్ ప్లానింగ్, శాంతి భద్రతలు, వస్తుత్పత్తి రంగాల్లో డ్రోన్ల వినియోగం విధాన రూపకల్పనపై అమరావతి డ్రోన్ సమ్మిట్-2024 దృష్టి పెట్టనుంది. వాణిజ్యపరంగా డ్రోన్ల వినియోగం పెంచడం లక్ష్యంగా కాన్ఫరెన్స్ జరగనుంది. ఈ సదస్సులో డ్రోన్ సిటీ ఏర్పాటుకు సంబంధించిన రోడ్ మ్యాప్ రూపకల్పన చేయనుంది. ఏపీ డ్రోన్ కార్పోరేషన్ ఈ సమ్మిట్‌ను నిర్వహించనుంది.