national

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 11, 2024, 4:31 PM IST

ETV Bharat / snippets

సిక్స్​ప్యాక్​ కోసం స్టెరాయిడ్లు - సప్లయర్ అరెస్ట్

Man Arrested for Supplying Steroids to Gyms in Secunderabad
Man Arrested for Supplying Steroids to Gyms in Secunderabad (ETV Bharat)

Man Arrested for Supplying Steroids to Gyms in Secunderabad :తెలంగాణ రాష్ట్రంసికింద్రాబాద్​లోడ్రగ్​ కంట్రోల్ అధికారులు భారీగా స్టెరాయిడ్స్​ను పట్టుకున్నారు. జిమ్​లలో యువకులకు స్టెరాయిడ్స్​ సరఫరా చేస్తున్న ఖాసిం అనే వ్యక్తిని అరెస్టు చేశారు. సికింద్రాబాద్​లోని జిమ్​లో దేహదారుఢ్యం కోసం యువకులు రోజు కసరత్తులు చేస్తున్నారు. అయితే ఖాసిం అనే వ్యక్తి ఆ యువకులకు స్టెరాయిడ్స్​ సరఫరా చేస్తున్నట్లు వచ్చిన సమాచారంతో డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టెరాయిడ్స్​ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతన్ని పోలీసులకు అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details