LIVE : తెలంగాణ మంత్రి కొండా సురేఖ మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - Minister Konda Surekha LIVE - MINISTER KONDA SUREKHA LIVE
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 3, 2024, 9:44 AM IST
|Updated : Oct 3, 2024, 10:52 AM IST
Minister Konda Surekha Press Meet LIVE : హైదరాబాద్లోని లంగర్ హౌస్లో బాపూఘాట్ వేదికగా సమంత విషయంపై చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఈ మేరకు నటి సమంతకు ఆమె క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే అంటూ మంత్రి తెలిపారు. కానీ మీ మనోభావాలను దెబ్బతీయడం కాదన్నారు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు తనకు కేవలం అభిమానం మాత్రమే కాదు. ఆదర్శం కూడా అంటూ పేర్కొన్నారు. నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లు అయితే బేషరతుగా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని అన్యద భావించవద్దని మంత్రి సురేఖ వెల్లడించారు. ఈ విషయంపై సినీ ప్రముఖులు కొందరు ఆమె మాటలపై అసహనం వ్యక్తం చేశారు. ఇవాళ హనుమకొండలోని తన నివాసంలో మంత్రి కొండా సురేఖ మీడియా సమావేశం నిర్వహించి, మాట్లాడారు.
Last Updated : Oct 3, 2024, 10:52 AM IST