పట్టీ మింగిన 7 నెలల చిన్నారి - రిమ్స్ వైద్యుల చాకచక్యంతో నిలిచిన ప్రాణం
Published : 21 hours ago
7 Month Old Girl Swallowed Silver Anklet : 7నెలల చిన్నారి పట్టగొలుసు మింగటంతో గొంతులో ఇరుక్కొని ప్రాణాపాయం తలెత్తగా, ఆదిలాబాద్ రిమ్స్ వైద్యులు చాకచక్యంగా బయటకు తీసి పాప ప్రాణాలు కాపాడారు. ఆదిలాబాద్ గుడిహత్నూర్‌కు చెందిన ధ్రుతి తన కాలికి ఉన్న వెండి పట్ట గొలుసును నోట్లో పెట్టుకోవడంతో అది గొంతులో ఇరుక్కుపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌లో ఈఎన్టీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న మామిడి హేమంతరావు చాకచక్యంగా ఎండోస్కోపీ చేసి పట్టగొలుసును బయటకు తీశారు.