ETV Bharat / snippets

పీఎఫ్‌ బకాయిలు చెల్లించని యాజమాన్యం - యజమానిని జైలుకు పంపిన ఈపీఎఫ్‌వో

author img

By ETV Bharat Telangana Team

Published : 17 hours ago

MAN ARRESTED FOR PF DUES IN HYD
EPFO Arrest Man for PF Due (ETV Bharat)

EPFO Arrest Man for PF Due : ఉద్యోగుల పీఎఫ్‌ బకాయిలు చెల్లించని యాజమాన్యాలపై ఈపీఎఫ్‌వో చర్యలు చేపట్టింది. ఈ మేరకు చర్లపల్లిలోని ఓ ఇండస్ట్రియల్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ యాజమాన్యానికి చెందిన రమేశ్​ పర్టానిని అరెస్టు చేసినట్లు ఈపీఎఫ్‌వో హైదరాబాద్‌ విభాగం పేర్కొంది. 2004 నుంచి 2010 వరకు పని చేసిన వర్కర్లకు పీఎఫ్‌ బకాయిలను ఈ సంస్థ చెల్లించలేదు. పీఎఫ్​ బకాయిలు చెల్లించాలంటూ ఈపీఎఫ్‌వో పలుమార్లు నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదు.

దీంతో రమేశ్​ పర్టానిపై అరెస్టు వారెంట్​ జారీ కాగా, నల్లకుంట పోలీసుల సహకారంతో ఈపీఎఫ్​వో రమేశ్​ పర్టానిని బర్కత్‌పురా కార్యాలయంలో విచారించింది. కార్మికుల పీఎఫ్‌ బకాయిలు చెల్లించకపోవడంతో పాటు ఈపీఎఫ్‌వో చట్టం నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈపీఎఫ్‌వో రికవరీ అధికారి రమేశ్​ పర్టానికి జైలుశిక్ష విధించి చర్లపల్లి జైలుకు తరలించారు. కార్మికుల పీఎఫ్‌ బకాయిలు చెల్లించకుండా డిఫాల్ట్‌ అయ్యే యాజమాన్యాలపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఈపీఎఫ్‌వో రికవరీ అధికారి హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.