Ravindra Jadeja Retirement :క్రికెట్ అభిమానులకు వరుస షాకులిస్తూ రిటైర్మెంట్లు ప్రకటిస్తున్నారు టీమ్ఇండియా క్రికెటర్లు. ఇప్పటికే టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలకగా, తాజాగా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా తన రిటైర్మెంట్ను అనౌన్స్ చేశాడు.
రోహిత్, విరాట్ బాటలో జడేజా- ఇంటర్నేషనల్ టీ20లకు గుడ్‌బై
Published : Jun 30, 2024, 5:12 PM IST
![రోహిత్, విరాట్ బాటలో జడేజా- ఇంటర్నేషనల్ టీ20లకు గుడ్‌బై Ravindra Jadeja Retirement](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-06-2024/1200-675-21833587-thumbnail-16x9-jadeja.jpg)
"నేను మనస్ఫూర్తిగా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలుకుతున్నాను. ఎల్లప్పుడూ నా దేశం కోసం నా శక్తిమేరకు అత్యుత్తమ పెర్ఫామెన్స్ చూపించా. ఇకపై ఇతర ఫార్మాట్లలో (వన్డేలు, టెస్టులు) కెరీర్‌ను కొనసాగిస్తాను. టీ20 ప్రపంచకప్‌ను గెలవాలన్న నా కోరిక నెరవేరింది. ఇది నా అంతర్జాతీయ టీ20 కెరీర్లో ఓ ఉన్నతమైన శిఖరం. ఇన్నాళ్లు నాకు సపోర్ట్ చేసిన ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు" అంటూ ట్రోఫీ పట్టుకున్న ఫొటోను పోస్ట్ చేశాడు.
జడ్డూ ఇప్పటి వరకు 74 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 515 పరుగులు చేయడమే కాకుండా 54 వికెట్లు పడగొట్టాడు.