ETV Bharat / snippets

'వాళ్లతో ట్రావెల్ చేయడం నా కల- ఆనందంలో పాస్​పోర్ట్, ఫోన్ మర్చిపోయా'

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 3, 2024, 12:57 PM IST

Riyan Parag Zimbabwe Tour
Riyan Parag Zimbabwe Tour (Source: Getty Images)

Riyan Parag Zimbabwe Tour: టీమ్ఇండియాకు ఎంపికై తొలిసారి సీనియర్ జట్టుతో ట్రావిలింగ్ చేస్తున్న ఉత్సాహంలో తన పాస్​​పోర్ట్, మొబైల్ మర్చిపోయినట్లు యంగ్ బ్యాటర్ రియాన్ పరాగ్ చెప్పాడు. 5మ్యాచ్​ల టీ20 సిరీస్​ కోసం 15 మందితో కూడిన టీమ్ఇండియా జట్టు బుధవారం జింబాబ్వే చేరుకుంది. ఈ సందర్భంగా పరాగ్ బీసీసీఐ టీవీతో మాట్లాడాడు. టీమ్ఇండియా తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేయడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు.

'సీనియర్ జట్టుతో ట్రావెలింగ్ చేస్తున్న సంతోషంలో నా పాస్​పోర్ట్, ఫోన్​ మర్చిపోయాను. వాస్తవానికి నేను మర్చిపోలేదు. వాటిని వేరే ప్లేస్​లో ఉంచాను. చిన్నప్పటి నుంచి టీమ్ఇండియా జట్టుతో ప్రయాణించాలనేది నా కల. సాధారణంగా మనం చాలా క్రికెట్ ఆడతాం. కానీ, సీనియర్ జట్టుతో ట్రావెల్ చేయడం, టీమ్ఇండియా జెర్సీ ధరించడం ఎప్పటికీ ప్రత్యేకమే' అని పరాగ్ అన్నాడు. కాగా, జింబాబ్వే టూర్​కు ప్రకటించిన జట్టులో పరాగ్ సభ్యుడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.