ETV Bharat / health

మెడపై ముడతలు ఎబ్బెట్టుగా కనిపిస్తున్నాయా? - ఇలా చేస్తే ఈజీగా తగ్గిపోతాయి! - SKIN CARE TIPS

Best Tips To Tighten Neck Skin : చాలా మంది ముఖం అందంగా కనిపించడం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ.. మెడ భాగానికొచ్చేసరికి పెద్దగా శ్రద్ధ చూపరు. దాంతో.. వయసు పెరిగే కొద్దీ మెడ చూట్టూ ముడతలు, సన్నని గీతలు వస్తుంటాయి. మిమ్మల్ని కూడా ఈ సమస్య వేధిస్తోందా? అయితే.. ఈ టిప్స్ ద్వారా ఈజీగా తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు.

Natural Ways To Tighten Neck Skin
Best Tips To Tighten Neck Skin (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 4, 2024, 9:40 AM IST

Natural Ways To Tighten Neck Skin : మెడ చుట్టూ నల్లటి వలయాలు, ముడతలు, చర్మం వదులుగామారి సన్నని గీతలు రావడం.. వంటివి కొంతమందిని ఇబ్బందిపెడుతుంటాయి. మీరూ ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే.. మీకోసం కొన్ని అద్భుతమైన నేచురల్ టిప్స్ తీసుకొచ్చాం. అవి ఫాలో అవ్వడం ద్వారా చర్మ సౌందర్యం మెరుగుపడి.. నవ యవ్వనంగా కనిపిస్తారంటున్నారు సౌందర్య నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఆలివ్ నూనె : మెడ చుట్టూ ముడతలు తగ్గించడంలో ఆలివ్ నూనె చాలా బాగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం.. ముందుగా ముఖం, మెడ(Neck) భాగాలను గోరువెచ్చని వాటర్​తో శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత ఒక చిన్న బౌల్​లో కాస్త ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి. ఆపై చేతి మునివేళ్లతో ఆ నూనెను మెడ వద్ద అప్లై చేస్తూ స్మూత్​గా మసాజ్ చేసుకోవాలి. ఈ విధంగా మెడ చుట్టూ మర్దనా చేసుకోవడం వల్ల అక్కడి చర్మకణాలకు సహజ తేమ అందుతుంది. వదులైన స్కిన్ తిరిగి టైట్​గానూ మారుతుందని నిపుణులు చెబుతున్నారు.

తెల్లసొన, తేనె : మెడపై ముడతలు పోగొట్టడంలో ఇది సహజసిద్ధంగా పనిచేస్తుందంటున్నారు. ఇందుకోసం ముందుగా చిన్న బౌల్​లో గుడ్డులోని తెల్లసొన తీసుకొని దానికి రెండు చెంచాల తేనె యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ దాన్ని ఫేస్, నెక్​కు ప్యాక్​లా అప్లై చేసుకోవాలి. అలా పావుగంటసేపు ఉంచి ఆపై గోరువెచ్చని వాటర్​తో కడుక్కోవాలి. వారానికోసారి ఇలా చేయడం ద్వారా కొద్ది రోజుల్లోనే మంచి ఫలితం పొందవచ్చంటున్నారు.

మెడ నల్లగా ఉందని బాధపడుతున్నారా? - ఈ టిప్స్ ట్రై చేశారంటే తెల్లగా మారడం ఖాయం!

కలబంద : ఒక చిన్న బౌల్​లో చెంచా చొప్పున అలోవెరా జెల్, మయోనైజ్, తేనె తీసుకొని వాటిని బాగా కలుపుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ఫేస్, మెడ చుట్టూ ప్యాక్​లా అప్లై చేసుకోవాలి. అలా పావుగంట ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా చాలా తక్కువ టైమ్​లోనే మెడపై ఉన్న ముడతలు తగ్గి స్కిన్ కోమలంగా మారుతుందంటున్నారు నిపుణులు.

2014లో "Journal of Cosmetic and Dermatological Sciences"లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. 8 వారాలపాటు కలబంద జెల్‌తో ముఖం, మెడ వద్ద మసాజ్ చేసుకున్న మహిళల్లో ముడతల తీవ్రత తగ్గినట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనలో న్యూయార్క్​లోని మౌంట్ సినాయి స్కూల్ ఆఫ్ మెడిసిన్​కు చెందిన ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ డోనాల్డ్ డే పాల్గొన్నారు. కలబంద గుజ్జు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి ముడతలను తగ్గించడంలో సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.

పెరుగు, నిమ్మరసం : ఒక చిన్న బౌల్​లో రెండు చెంచాల పెరుగు తీసుకొని.. అందులో రెండు చుక్కల నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపై దాన్ని ఫేస్, మెడ చుట్టూ ప్యాక్​లా వేసుకోవాలి. అనంతరం చేతివేళ్లతో పావుగంటపాటు స్మూత్​గా మసాజ్ చేసుకోవాలి. 5 నిమిషాలు అలాగే ఉంచి ఆపై గోరువెచ్చని వాటర్​తో శుభ్రం చేసుకోవాలి. వారానికి ఇలా రెండు సార్లు చేస్తే మంచి ఫలితం లభిస్తుందంటున్నారు నిపుణులు.

వీటితో పాటు.. క్రమం తప్పకుండా మెడ భాగానికి సంబంధించిన ఎక్సర్​సైజ్​లు చేయడం ద్వారా చర్మంపై ఉండే ముడతలు తగ్గడమే కాకుండా.. వదులుగా మారిన స్కిన్ తిరిగి బిగుతుగా మారుతుందంటున్నారు నిపుణులు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

అలర్ట్ : తాజా చర్మం కోసమంటూ - పదే పదే ముఖం కడుక్కుంటున్నారా? - ఏం జరుగుతుందో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.