national

ETV Bharat / snippets

భారత్ గర్వించేలా చేస్తారు- ఒలింపిక్స్​ అథ్లెట్లతో మోదీ

Modi Met Olympic Athletes
Modi Met Olympic Athletes (Source: ANI (Modi), Getty Images (Athletes))

By ETV Bharat Telugu Team

Published : Jul 5, 2024, 9:52 AM IST

Modi Met Olympic Athletes:పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారుల బృందం దేశం గర్వించేలా 140కోట్ల మంది ఆకాంక్షలకు అనుగుణంగా సత్తా చాటాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. టోక్యో ఒలింపిక్స్‌లో ఓ స్వర్ణంసహా భారత్‌ 7పతకాలు సాధించింది. ఈసారి ఆ సంఖ్య మరింత మెరుగుపడాలని భావిస్తున్న మోదీ, పారిస్‌ వెళ్తున్న అథ్లెట్లతో సమావేశమయ్యారు. భారత అథ్లెట్లు తమ అత్యుత్తమ ప్రదర్శన ద్వారా యావత్‌ దేశం గర్వించేలా చేస్తారని విశ్వసిస్తున్నట్లు ఎక్స్‌లో మోదీ పేర్కొన్నారు.

అథ్లెట్లు, సహాయక సిబ్బంది, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, షూటింగ్ స్పోర్ట్ డైరెక్టర్ పియరీ బ్యూచాంప్‌, క్రీడామంత్రి మన్​సుఖ్ మాండవియా, IOA అధ్యక్షురాలు పిటి ఉషతో కలిసి దిగిన చిత్రాలను మోదీ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా పారిస్‌లోనూ సత్తా చాటాలని జావెలిన్ త్రో ఛాంపియన్‌ నీరజ్ చోప్రా, బాక్సర్ నిఖత్ జరీన్, పీవీ సింధుతో ప్రధాని వర్చువల్‌గా మాట్లాడారు.

ABOUT THE AUTHOR

...view details