'నన్ను అరెస్టు చేయలేదు' - నిషేధంపై స్పందించిన అంతిమ్
Published : Aug 8, 2024, 5:46 PM IST
AntimPanghal Paris Olympics 2024 :రెజ్లర్ అంతిమ్ఫంగాల్, తన సోదరిని ఒలింపిక్ విలేజ్‌లోకి తన అక్రిడిటేషన్‌తో పంపించడం ప్రస్తుతం వివాదాస్పదమైంది. దీంతో క్రమశిక్షణ రాహిత్యం కింద అంతిమ్‌పై మూడేళ్లపాటు నిషేధం విధించారు. దీనిపై స్పందించిన అంతిమ్ తనను, తన సోదరిని అరెస్ట్ చేసినట్లు వచ్చిన వార్తలు అవాస్తమని చెప్పింది. "క్వార్టర్స్‌లో నేను ఓడిపోయా. అనంతరం నేను, నా సోదరి అరెస్టైనట్లు వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదు. ఓడిపోయాక నాకు జ్వరం వచ్చింది. ఓపిక లేదని నా సోదరిని హోటల్‌కు వెళ్లింది. కోచ్‌ల అనుమతి తీసుకునే హోటల్‌కు వెళ్లాం. ఒలింపిక్ విలేజ్‌లో నాకు అవసరమైన వస్తువులు ఉన్నాయి. నేను నిద్రపోయిన తర్వాత నా సోదరి అక్రిడిటేషన్ కార్డు తీసుకుని అక్కడికి వెళ్లి, వస్తువులను తీసుకెళ్లొచ్చా? అని అధికారులను అడిగింది. వాళ్లు ఆమెదగ్గరున్న అక్రిడిటేషన్ కార్డ్ తీసుకుని వెరిఫికేషన్ కోసం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. మమ్మల్ని అరెస్టు చేయలేదు." అని చెప్పింది.