హ్యాట్రిక్ పతకానికి ఇంకొక్క అడుగే - ఆ విభాగంలోనూ ఫైనల్‌కు మను బాకర్
Published : Aug 2, 2024, 5:15 PM IST
Paris Olympics 2024 Indian Shooter Manu Bhaker (source Associated Press)
Paris Olympics 2024 Indian Shooter Manu Bhaker : భారత యంగ్ షూటర్ మను బాకర్ పారిస్ ఒలింపిక్స్‌లో దూకుడు చూపిస్తోంది. ఇప్పుడు ఆమె మరో పతకంపై గురి పెట్టింది. ఇప్పటికే ఈ ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్‌ను ఖాతాలో వేసుకున్న మను ఇప్పుడు మూడో విభాగంలోనూ ఫైనల్‌కు అర్హత సాధించింది. షూటింగ్ మహిళల 25మీ. పిస్టల్ క్వాలిఫికేషన్ రౌండ్లో టాప్ 2లో నిలిచింది. తద్వారా తుది పోరుకు దూసుకెళ్లింది.