Paris Olympics 2024:పారిస్ ఒలింపిక్స్‌లో అభిమానుల అంచనాలను నిజం చేస్తూ పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా ఫైనల్‌కు దూసుకెళ్లాడు. మంగళవారం జరిగిన క్వాలిఫికేషనల్ రౌండ్లో ఈటను ఏకంగా 89.34 మీటర్లు విసిరి సత్తాచాటాడు. దీంతో నీరజ్ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఆగస్టు 8న నీరజ్ ఫైనల్లో బరిలో దిగనున్నాడు. ఈసారి కూడా నీరజ్ పసిడి సాధిస్తాడన్న అంచనాలు ఉన్నాయి.
ఫైనల్‌కు నీరజ్- మరో గోల్డ్ మెడల్ లోడింగ్!
Paris Olympics (Source: Getty Images)
Published : Aug 6, 2024, 4:02 PM IST
మరోవైపు ఇదే ఈవెంట్లో కిశోర్ జెనా క్వాలిఫికేషన్ రౌండ్లోనే నిష్క్రమించాడు. తొలి ప్రయత్నంలో 80.73 మీటర్లు విసిరినప్పటికీ రెండో ప్రయత్నంలో ఫౌల్, మూడో అటెంప్ట్‌లో 80.21 మీటర్లు విసిరాడు. ఫైనల్‌కు నేరుగా అర్హత సాధించాలంటే 84 మీటర్ల దూరం జావెలిన్‌ను విసరాలి. లేదా టాప్ -12లో అయినా నిలవాలి. కాగా, మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ క్వార్టర్స్‌కు చేరింది. 50 కేజీల ప్రిక్వార్టర్స్‌లో 3-2తో సుసాకి (జపాన్)పై గెలుపొందింది.