Mohammed Shami Comeback :టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ రీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అటు బీసీసీఐ కూడా అతడి కమ్‌బ్యాక్ గురించి ఆచితూచి వ్యవహరిస్తోంది. గతేడాది వన్డే వరల్డ్‌కప్ గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న షమీ రీసెంట్గా ప్రాక్టీస్ మొదలు పెట్టేశాడు. తాజాగా తన రీ ఎంట్రీ గురించి షమీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇప్పుడే టీమ్ఇండియాలోకి రావాలని లేదని పేర్కొన్నాడు.
టీమ్ఇండియాలోకి ఇప్పుడే రావాలని లేదు! : షమీ
Mohammed Shami Comeback (Source : Getty Images)
Published : Sep 15, 2024, 7:35 PM IST
'నేను గాయం నుంచి కోలుకొని బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాను. కానీ 100 శాతం ఫిట్నెస్ సాధించే దాకా నేను టీమ్ఇండియాలో రీ ఎంట్రీ ఇవ్వను. అది న్యూజిలాండ్ సిరీస్ అయినా, ఆస్ట్రేలియా సిరీస్ అయినా సరే. పూర్తి ఫిట్నెస్తోనే బరిలోకి దిగుతాను. ఎందుకంటే టీమ్ఇండియాకు నేను నా అత్యత్తమ ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నా' అని రీసెంట్గా బంగాల్ క్రికెట్ అసోసియేషన్ వార్షిక అవార్డ్స్ వేడుకల్లో పాల్గొన్న షమీ అన్నాడు.