national

'నీది 100గ్రా, నాది 50గ్రాములే'- వినేశ్​ లాగే జపాన్ రెజ్లర్ బాధ కూడా!

By ETV Bharat Sports Team

Published : Aug 10, 2024, 12:34 PM IST

Vinesh Phogat Disqualification
Vinesh Phogat Disqualification (Getty Images (Left), Associated Press (Right))

Vinesh Phogat Disqualification:పారిస్‌ ఒలింపిక్స్‌లో అనర్హత వేటుతో ఫైనల్​కు దూరమైన రెజ్లర్ వినేశ్‌ ఫొగాట్​ను జపాన్‌ రెజ్లర్‌ రేయ్‌ హిగుచి ఓదారుస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. 'నీ బాధను నేను అర్థం చేసుకోగలను. నాది 50 గ్రాముల వేదనే! ఇప్పుడు నీ చుట్టూ వినిపిస్తున్న మాటల గురించి ఆందోళన చెందకు. జీవితం సాగుతూనే ఉంటుంది. ఎదురుదెబ్బల నుంచి నేర్చుకొని ఎదిగిన ప్రయాణం అత్యంత అందంగా ఉంటుంది. బాగా విశ్రాంతి తీసుకో' అంటూ వినేశ్ రిటైర్మెంట్ పోస్టుకు రిప్లై ఇచ్చాడు.

అయితే 2020 టోక్యో ఒలింపిక్స్​లో హిగుచి 50 గ్రాముల అధిక బరువు కారణంగా క్వాలిఫికేషన్‌ పోరులో అనర్హత వేటుకు గురయ్యాడు. దీని నుంచి కోలుకున్న అతడు తాజా పోటీల్లో ఏకంగా పసిడి ముద్దాడాడు. కాగా, ప్రస్తుత ఒలింపిక్స్​లో 53కేజీల విభాగంలో ఫైనల్​ చేరిన వినేశ్ పసిడి పోరుకు ముందు 100 గ్రాముల బరువు అధికంగా ఉన్న కారణంగా డిస్​క్వాలిఫై అయ్యింది.

ABOUT THE AUTHOR

...view details