4 Gold Medals Paris Olympics:పారిస్ ఒలింపిక్స్‌లో ఫ్రాన్స్‌కు చెందిన ఓ కుర్రాడు సంచలనం సృష్టించాడు. 22ఏళ్ల స్విమ్మర్ లియోన్ మార్చండ్ ప్రస్తుత ఒలింపిక్స్‌లో 4 బంగారు పతకాలు సాధించి ఔరా అనిపించాడు. అందులో రెండు పతకాలు ఒక్క రాత్రిలోనే సాధించి చరిత్ర సృష్టించాడు. 1976 తర్వాత స్విమ్మింగ్‌లో ఒక్క రాత్రిలో రెండు గోల్డ్ మెడల్స్ సాధించిన తొలి అథ్లెట్‌గా నిలిచాడు.
22ఏళ్ల స్విమ్మర్ ఖాతాలో 4 గోల్డ్ మెడల్స్- అందులో 2 సింగిల్ నైట్‌లో కొట్టినవే
Published : Aug 3, 2024, 11:19 AM IST
4 Gold Medals Paris Olympics (Source: Associated Press)
గురువారం జరిగిన 200మీటర్ల బటర్‌ఫ్లై, 200మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ రెండు వేర్వేరు ఈవెంట్లలో 2 స్వర్ణ పతకాలు నెగ్గగా, శుక్రవారం అర్ధరాత్రి 200మీటర్ల ఇండివిజ్యువల్ మెడ్లీలో పసిడి పట్టేశాడు. కాగా, జులై 29న 400మీటర్లు ఇండివిజ్యువల్ మెడ్లీలో నెగ్గి ఫస్ట్ గోల్డ్ మెడల్ ముద్దాడాడు. దీంతో పారిస్ ఒలింపిక్స్‌లోనే లియోన్ ఖాతాలో 4 బంగారు పతకాలు చేరాయి.