Cristiano Ronaldo Youtube Channel: లెజెండరీ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో మరో అరుదైన ఘనత సాధించాడు. యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన ఆరు రోజుల్లోనే 50మిలియన్ల సబ్స్క్రైబర్ల మార్క్ అందుకున్నాడు. ఈ క్రమంలో అతి తక్కువ సమయంలో 50మిలియన్ల సబ్స్క్రైబర్ల మైలురాయి అందుకున్న యూట్యూబర్‌గా రొనాల్డో రికార్డు కొట్టాడు. కాగా, రొనాల్డో యువర్ క్రిస్టియానో (UR Cristiano) పేరుతో ఆగస్టు 21న యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాడు.
యూట్యూబ్‌లోనూ రొనాల్డో రికార్డులు- ఆరు రోజుల్లోనే 50మిలియన్ సబ్స్క్రైబర్లు
Published : Aug 28, 2024, 6:25 PM IST
దీనికి ఊహించని రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది. ఛానెల్ ప్రారంభించిన 90 నిమిషాల్లో 1మిలియన్, 12గంటలలోపే 13మిలియన్ల సబ్స్క్రైబర్లు అయ్యారు. దీంతో ఛానెల్ ఓపెనింగ్ రోజే రొనాల్డోకు యూట్యూబ్ నుంచి 'గోల్డెన్ ప్లే బటన్' అందింది. ఎప్పుడూ గ్రౌండ్లో అదరగొట్టే రొనాల్డో యూట్యూబ్‌లోనూ రికార్డులు సృష్టిస్తుండడం వల్ల ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఛానెల్‌కు 50.3మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇక రొనాల్డోకు ట్విట్టర్లో 112.6మిలియన్, ఫేస్బుక్లో 170 మిలియన్, ఇన్‌స్టాగ్రామ్‌లో 636 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.