BCCI Meeting Postponed:బీసీసీఐ సెలక్షన్ కమిటీ సమావేశం బుధవారం జరగాల్సి ఉంది. అయితే అది కాస్త గురువారానికి వాయిదా పడింది. ఇదే మీటింగ్లో శ్రీలంక పర్యటనకు టీ20, వన్డే సిరీస్ల జట్లను ఎంపిక చేయాల్సి ఉంది. అయితే టీ20 ఫార్మాట్లో కెప్టెన్ విషయంలో డైలామా వల్ల మీటింగ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది.
BCCI సెలక్షన్ కమిటీ మీటింగ్ వాయిదా- కారణం అదే!
Published : Jul 17, 2024, 8:45 PM IST
Bcci Meeting Postponed (Source: Getty Images)
మరోవైపు కెప్టెన్ రోహిత్ వన్డే సిరీస్ ఆడాలని హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ కోరాడట. దీనికి రోహిత్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. అయితే ప్రస్తుతం ఫారిన్ ట్రిప్లో ఉన్న రోహిత్ ఎప్పుడు భారత్కు రిటర్న్ అవుతాడో క్లారిటీ వచ్చాక జట్టును ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. అందుకే సమావేశాన్ని గురువారానికి వాయిదా వేసినట్లు సమాచారం. ఇక గురువారమే టీ20, వన్డే జట్లను ప్రకటించే ఛాన్స్ ఉంది.